The Economist on PM Modi Popularity: ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా (PM Modi Popularity) అంతకంతకూ పెరుగుతూ పోతోంది. 2014-19 కన్నా ఈ ఐదేళ్లలో ఆయనకు మరింత పాపులారిటీ వచ్చింది. సాధారణ ప్రజలే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులూ మోదీని అభిమానిస్తున్నారని అంతర్జాతీయ వార్తా సంస్థ The Economist  వెల్లడించింది. విద్యావంతులైన ఓటర్ల నుంచి ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని స్పష్టం చేసింది. 'Why India's elites back Narendra Modi' పేరుతో ప్రత్యేకంగా ఓ కథనం రాసింది. అందులో మోదీకి పాపులారిటీ పెరగడానికి కారణాలేంటో ప్రస్తావించింది. మచ్చ లేని రాజకీయాలు, ఆర్థిక సంస్కరణలు, ప్రముఖుల నుంచి మద్దతు లాంటి కారణాలు మోదీ క్రేజ్‌ని అమాంతం పెంచేస్తున్నాయని వివరించింది. రైట్ వింగ్‌ రాజకీయాల్ని ఫాలో అయ్యే డొనాల్డ్ ట్రంప్‌ వాళ్లతోనూ ఆయన సులువుగా కలిసిపోయారని, సిద్ధాంతాలపరంగా వైరుద్ధ్యం ఉన్నా వాటిని పక్కన పెట్టారని వెల్లడించింది. మూడోసారి కచ్చితంగా గెలిచే సామర్థ్యం మోదీకి ఉందని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా Gallup survey గురించి ప్రస్తావించింది. అమెరికాలో ఓ సర్వే చేపట్టగా అందులో చదువుకున్న వాళ్లలో 26% మంది ట్రంప్‌కి మద్దతునిచ్చారు. అదే నరేంద్ర మోదీకి మాత్రం చదువుకున్న వాళ్లలో 50% మంది మద్దతు తెలిపారు. Pew Research survey గురించీ ప్రస్తావించింది ది ఎకనామిస్ట్ ఆర్టికల్. 2017లో భారతీయుల్లో ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయని వాళ్లలో 66% మంది మోదీకి అనుకూలంగా ఉన్నట్టు వెల్లడించారు. అదే పై చదువుకున్న వాళ్లలో దాదాపు 80% మంది మోదీకే ఓటు వేశారు. 


కారణాలివేనట..


2019 లోక్‌సభ ఎన్నికల తరవాత లోక్‌నీతి సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించినట్టు ఎకనామిస్ట్ ఆర్టికల్ వివరించింది. డిగ్రీ ఉన్న వాళ్లలో 42% మంది మోదీకి జై కొట్టారు. ప్రాథమిక విద్యతోనే ఆపేసిన వాళ్లలో 35% మంది ఆయనకు అనుకూలంగా ఉన్నట్టు తేలింది. అలా అని ఆయనకు మిగతా వర్గాల నుంచి పెద్దగా మద్దతు లేదు అనుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది ఈ ది ఎకనామిస్ట్. వెనకబడిన వర్గాల నుంచీ ఆయనకు మంచి మద్దతు లభిస్తోందని వివరించింది. కేవలం  భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ ఆయనకు మద్దతు వస్తోందని వెల్లడించింది. భారత్‌ GDP బలంగా ఉండడం, ఎగువ మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరగడం లాంటి కారణాలూ ఆయన పాపులారిటీని పెంచినట్టు తెలిపింది. 2000 సంవత్సరంలో కాంగ్రెస్‌ పార్టీకి ఇదే విధంగా మద్దతు లభించిందని...అయితే వరుస కుంభకోణాల వల్ల 2010 నాటికి ఆ మద్దతు తగ్గిపోయిందని వెల్లడించింది. కాంగ్రెస్ ప్రస్తుతం సంపన్నుల మద్దతు పూర్తిగా కోల్పోయిందని తెలిపింది. డిజిటల్ పేమెంట్స్ సహా మరి కొన్ని ఆర్థిక సంస్కరణలు బీజేపీకి ప్రజలు మొగ్గు చూపేలా చేశాయని The Economist వివరించింది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ 1వ తేదీన వరకూ లోక్‌సభ ఎన్నికలు 7 విడతల్లో జరగనున్నాయి. జూన్ 4వ తేదీన కొత్త ప్రభుత్వం అధికారంలోకి రానుంది. హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని బీజేపీ చాలా ధీమాగా ఉంది. 


Also Read: బర్త్‌డే కేక్‌ తిన్న కాసేపటికే వాంతులు, ఫుడ్ పాయిజన్‌తో పదేళ్ల బాలిక మృతి