Google CEO Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన పదవికి రాజీనామా చేయనున్నారా...? ప్రస్తుతం ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మధ్యే గూగుల్‌ AI Gemini ఇమేజ్ జనరటేర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిపై సుందర్ పిచాయ్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ...ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇది కంపెనీ క్రెడిబిలిటీని కాస్త దెబ్బ తీసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే...ఇప్పుడు అందరూ సుందర్ పిచాయ్‌ని నిందిస్తున్నట్టు సమాచారం. ఆయనను ఆ పదవి నుంచి తప్పించి మరొకరికి ఆ అవకాశమివ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి Gemini Image Generator ని ఆపేసింది గూగుల్. అంతే కాదు. AI టెక్నాలజీపైనా పెట్టుబడులు పెట్టడాన్ని కాస్త తగ్గించింది. ఇందులో ఇమేజ్‌లు సరైన విధంగా జనరేట్ అవడం లేదు. ఈ సర్వీస్‌ని నిలిపివేసినప్పటి నుంచి కంపెనీలో అంతర్గతంగా విభేదాలు వస్తున్నట్టు తెలుస్తోంది. స్టాక్ వాల్యూ కూడా పడిపోయిందని ఇంటర్నల్ రిపోర్ట్‌లు చెబుతున్నాయి. అందుకే...సుందర్ పిచాయ్‌ స్థానంలో మరొకరిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టాలని బోర్డ్‌ భావిస్తోంది. ఇప్పటికే గూగుల్‌లో మేనేజ్‌మెంట్‌ విషయంలో చాలా సమస్యలు వస్తున్నట్టు బిజినెస్ ఇన్‌సైడర్ రిపోర్ట్ చెబుతోంది. నష్టాల్ని భర్తీ చేసుకునేందుకు గూగుల్ పెద్ద ఎత్తున లేఆఫ్‌లు ప్రకటించింది. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై చాలా సందర్భాల్లో సుందర్ పిచాయ్ మాట్లాడారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని వివరణ ఇచ్చారు. ఇంత చేసినా కంపెనీ ఇంకా గాడిన పడలేదు. 


గూగుల్‌లో లేఆఫ్‌లు (Google Layoffs) కొనసాగుతూనే ఉన్నాయి. పేరెంట్ కంపెనీ Alphabet ఇటీవలే లేఆఫ్‌లపై మరో కీలక ప్రకటన చేసింది. డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్, ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్స్‌లో వంద మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. కాస్ట్‌ కట్టింగ్‌లో భాగంగా ఈ లేఆఫ్‌లు కొన్నాళ్ల పాటు కొనసాగించక తప్పదని (Google Hardware Layoffs) తేల్చి చెప్పింది. వాయిస్ బేస్డ్‌ Google Assistant తో పాటు AR హార్డ్‌వేర్‌లోని ఉద్యోగులపై ఈ ఇంపాక్ట్ పడనుంది. వీళ్లతో పాటు కంపెనీ సెంట్రల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులకూ వేటు తప్పడం లేదు. మారుతున్న పరిస్థితుల ఆధారంగా కంపెనీలో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తోందని గూగుల్ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ డిపార్ట్‌మెంట్స్‌కి చెందిన ఉద్యోగులను తొలగిస్తామని స్పష్టం చేసింది. 


"2023 సెకండాఫ్‌లో కంపెనీలోని చాలా వరకూ టీమ్స్‌లో మార్పలు చేర్పులు చేయాల్సి వచ్చింది. కేవలం పనిని మరింత ఎఫెక్టివ్‌గా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పులు చేశాం. ఉన్న వనరులతోనే మంచి ఫలితాలు రాబట్టాలని చూస్తున్నాం. కొన్ని టీమ్స్‌లో కొంత మందిని తొలగించక తప్పడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ లేఆఫ్‌ల ప్రభావం ఉంటుంది"


- గూగుల్ ప్రతినిధి