Stocks to watch today, 12 January 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 50 పాయింట్లు లేదా 0.28 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,000 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ గ్యాప్‌ అప్‌లో ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


ఇన్ఫోసిస్: ఈ సాఫ్ట్‌వేర్ మేజర్ తన 2022 డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలను మార్కెట్ ముగిసిన తర్వాత విడుదల చేస్తుంది. మార్కెట్‌ అంచనాల ప్రకారం, ఈ కంపెనీ ఏకీకృత ఆదాయం YoYలో 19%, QoQలో 4% పెరిగి రూ. 37,890 కోట్లకు చేరుకోవచ్చు. నికర లాభం YoYలో 11%, QoQలో 7.2% పెరిగి రూ. 6,455.40 కోట్లకు చేరుకుందని అంచనా వేస్తున్నారు. 


HCL టెక్నాలజీస్: ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా తన డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలను మార్కెట్ ముగిసిన తర్వాత విడుదల చేస్తుంది. FY23 మార్గదర్శకాలను 13.5-14.5% గ్రోత్ బ్యాండ్ దిగువ ముగింపుకు ఈ కంపెనీ సర్దుబాటు చేసింది. ఈ త్రైమాసికంలో స్థిర కరెన్సీ (CC) పరంగా QoQలో 3.2% ఏకీకృత రాబడి వృద్ధిని నివేదించవచ్చు. 


రిలయన్స్ ఇండస్ట్రీస్: RIL టెలికాం విభాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ. 40,446 కోట్లు పెట్టుబడితో తమిళనాడులోని ఐదు నగరాల్లో True 5G సేవలను ప్రారంభించింది. చెన్నైలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ సదుపాయంతో పాటు.. కొత్తగా కోయంబత్తూరు, మదురై, తిరుచిరాపల్లి, సేలం, హోసూర్, వెల్లూరులో 5G సేవలను బుధవారం నుంచి ప్రారంభించింది.


టాటా మోటార్స్: తన ఎలక్ట్రిక్ కార్ పోర్ట్‌ఫోలియోను కొత్త మోడల్స్‌తో, అధిక ధరలతో విస్తరించాలని యోచిస్తోంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ (EV) కంపెనీగా అగ్రస్థానంలో నిలవాలని చూస్తోంది. తన EVల కోసం వివిధ ఛాయిస్‌ రేంజ్‌లను కూడా అందించబోతోంది. 


హిందుస్థాన్ యూనిలీవర్: Zywie Venturesలో 51% వాటాను రూ. 264.28 కోట్లతో కొనుగోలు చేసినట్లు హిందుస్థాన్ యూనిలీవర్ వెల్లడించింది.జైవీ వెంచర్స్‌లో 51% వాటాను కొనుగోలు చేయనున్నట్లు  గత ఏడాది డిసెంబర్ 8న HUL ప్రకటించింది. ఈ కొనుగోలు ద్వారా ఆరోగ్య విభాగంలోకి అడుగు పెట్టింది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్: ఖనిజాల అన్వేషణ, ఇంధనం, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, బొగ్గు రంగాల్లో మధ్యప్రదేశ్‌లో రూ. 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే, ఎప్పటికి ఈ పెట్టుబడులను ప్రారంభిస్తుందో చెప్పలేదు.


రూట్ మొబైల్: శ్రీలంకలో ఇంటర్నేషనల్‌ A2P మెసేజింగ్ కోసం ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్స్‌ నుంచి 2 సంవత్సరాల కాంట్రాక్టును రూట్‌ మొబైల్‌ దక్కించుకుంది.


సైయెంట్: IT సేవలను అందించే ఈ కంపెనీ తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. ఇటీవల, ఈ కంపెనీ అనుబంధ సంస్థ Cyient DLM రూ. 740 కోట్ల IPO కోసం పత్రాలను దాఖలు చేసింది. 3 సంవత్సరాల వ్యవధిలో Cyient షేర్లు 97% రాబడిని ఇచ్చాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.