Tahawwur Rana lands in Delhi: భారత్ సుదీర్ఘంగా నిరీక్షిస్తున్న క్షణం వచ్చింది. ముంబై దాడుల ప్రధాన సూత్రధారుల్లో ఒకరిగా ఉన్న తహవ్యూర్ రాణా అనే టెర్రరిస్టును అమెరికా నుంచి లాక్కొచ్చారు. ప్రత్యేక విమానంలో ఆ టెర్రరిస్టును ఢిల్లీ తీసుకు వచ్చారు. ఆయనను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని ప్రశ్నించనుంది.టెర్రరిస్టుల్ని పెట్టే జైల్లో అతన్ని పెట్టనున్నారు.
తహవూర్ రాణాను ఇండియాకు తీసుకు రావడంపై ముంబై పేలుళ్ల బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ కసబ్ కు పెట్టినట్లుగా బిర్యానీలతో మేపకుండా.. చేసి తప్పునకు శిక్షఅనుభవించేలా చేయాలని కోరుతున్నారు .
ముంబై దాడుల రోజున అసలేం జరిగిందో.. కొంత మంది ప్రత్యక్ష సాక్షులు మీడియాతో గుర్తు చేసుకున్నారు. అంత భయంకర దాడులకు కుట్ర చేసిన వారికి ఉరి శిక్ష వేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ముంబై దాడుల ఆపరేషన్ లో పాల్గొన్న పోలీసులు ఇప్పటికి కీలక సూత్రధారిని తీసుకు రావడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తహవూర్ రాణాను ఇంతకు ముందు దోషిగా గుర్తించారు. ఆయనకు కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.