Southwest Monsoon: ఈ ఏడాది భారతదేశంలో వర్షాలకు ఎలాంటి లోటు లేదని భారత వాతావరణ శాఖ చెప్పింది. నైరుతి రుతుపవనాలతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ప్రకటించింది. నైరుతి రుతుపవనాల సమయంలో వాయువ్య భారతదేశం, పశ్చిమ, మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ద్వీపకల్ప ప్రాంతాలను ఆనుకొని ఉన్న తూర్పు, ఈశాన్య ప్రాంతాలు, వాయువ్య ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలినో పరిస్థితులు వర్షాకాలం సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని.. ద్వితీయార్థంలో దీని ప్రభావం ఉండే అవకాశాలు మరింత ఉన్నట్లు చెప్పుకొచ్చింది. 






అయితే ఇటీవలే భారతీయులకు బ్యాడ్ న్యూస్ అంటూ ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయని, వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండని ఈ సంస్థ తెలిపింది. దేశంలో రుతుపవన వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉండనున్నాయని చెప్పుకొచ్చింది. కరువు ఏర్పడేందుకు 20 శాతం అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది.  కానీ ఐఎండీ దీనికి భిన్నంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. రైతులు ఫికర్ పడొద్దంటూ భరోసా ఇచ్చింది.