రియల్ హీరో సోనూసూద్.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. ఇరువురు కలిసి ప్రెస్ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్.. సోనూసూద్ ను 'దేశ్ కే మెంటార్స్' కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు.
రాజకీయాల్లోకి..
సోనూసూద్, కేజ్రీవాల్ భేటీపై రాజకీయ విశ్లేషకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. సోనూసూద్ ను ఆమ్ ఆద్మీ తరఫున రాజకీయాల్లోకి ఆహ్వానించడానికి కేజ్రీవాల్ ఆయనతో భేటీ అయ్యారని విశ్లేషకులు అంటున్నారు. అయితే పంజాబ్ లో ఆమ్ ఆద్మీని బలోపేతం చేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేయాలని కేజ్రీవాల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇందుకోసం కసరత్తు చేస్తున్నారు. సోనూసూద్ సొంత రాష్ట్రం పంజాబ్. ఇది కూడా దృష్టిలో పెట్టుకునే కేజ్రీవాల్ సోనూసూద్ ను దగ్గర చేసుకుంటున్నారన్న మాట కూడా వినిపిస్తోంది.
ఆప్ ప్రభుత్వ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు సోనూసూద్ అంగీకరించడం కూడా ఈ విశ్లేషణకు బలం చేకూరుస్తోంది. మరి సోనూసూద్ ఏం చేస్తారో చూడాలి.