Somalia Vessel Hijacked:
షిప్ హైజాక్..
అరేబియన్ సముద్రంలో మాల్టా దేశానికి చెందిన వెజెల్ (Malta Ship Hijack) హైజాక్‌కి గురైంది. సోమాలియాకి వెళ్తున్న క్రమంలో కొందరు సముద్రపు దొంగలు ఈ షిప్‌ని హైజాక్ చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఇండియన్ నేవీని సాయం కోరింది ఆ షిప్ సిబ్బంది. అప్పటికే అరేబియన్ సముద్రంలో ప్యాట్రోలింగ్ చేస్తోంది ఇండియన్ నేవీ. Indian Naval Maritime Patrol Aircraft ఇప్పటికే సహాయక చర్యల కోసం సిద్ధమైంది. దీంతో పాటు Anti Piracy patrolకి చెందిన వార్‌షిప్‌నీ దారి మళ్లించింది ఇండియన్ నేవీ. హైజాక్‌కి గురైన వెజెల్‌కి సాయం చేసేందుకు బయల్దేరింది. ఈ మేరకు ఇండియన్ నేవీ అధికారికంగా ఓ ప్రకటన చేసింది. ఈ ప్రాంత భద్రతకు తాము ఎప్పటికీ కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు వెల్లడించింది.
"హైజాక్‌కి గురైన వెజెల్ నుంచి మాకు సమాచారం అందింది. ఆరుగురు ఆగంతకులు హైజాక్ చేసినట్టు అక్కడి సిబ్బంది తెలిపింది. సమాచారం అందిన వెంటనే స్పందించాం. నావల్ మారిటైమ్ ప్యాట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ని దారి మళ్లించాం. ఆ ప్రాంతంలో ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు భారత నేవీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అంతర్జాతీయ భాగస్వాముల భద్రతకూ ప్రాధాన్యతనిస్తాం"
- భారత నేవీ
తగ్గిన దాడులు..
మాల్టాకి చెందిన MV Reun షిప్ హైజాక్‌కి గురైనట్టు అధికారులు వెల్లడించారు. హైజాక్‌కి గురైన వెంటనే సిబ్బంది షిప్‌పై నియంత్రణ కోల్పోయింది. 2017 నుంచి ఈ తరహా దాడులు ఎప్పుడూ జరగలేదు. సోమాలియా పైరేట్స్ గతంలో ఇలాంటి దాడులు చేసినప్పటికీ ఇంత భారీ వెజెల్‌ని అధీనంలోకి తీసుకోవడం ఈ మధ్య కాలంలో చాలా అరుదు. ఈ ప్రాంతంలో నిఘా పెరగడమే ఇందుకు కారణం. అరేబియన్ సముద్రంలో ప్రయాణించే షిప్‌లు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే యూకే అలెర్ట్ జారీ చేసింది. ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే తెలియజేయాలని సూచించింది.
Also Read: Gaza: సొంత దేశ బందీలనే చంపుకున్న ఇజ్రాయేల్, పొరపాటు జరిగిందంటూ నెతన్యాహు విచారం