Israel Gaza War: 



ముగ్గురు బందీలు హతం..


గాజాపై ఇజ్రాయేల్ (Israel Hamas War) దాడులు కొనసాగుతున్నాయి. హమాస్‌ని పూర్తిగా అంతం చేసేంత వరకూ వెనక్కి తగ్గమని ఇప్పటికే ఇజ్రాయేల్ ప్రకటించింది. అయితే..ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాలన్న తొందరలో ఇజ్రాయేల్ ఓ పొరపాటు చేసింది. సొంత దేశానికి చెందిన బందీలనే కాల్చి చంపింది. ముగ్గురు బందీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల వల్ల ఏదో ముప్పు ఉందని అనుమానించి కాల్పులు జరిపింది ఇజ్రాయేల్ సైన్యం. ఆ తరవాత వాళ్లు ముగ్గురూ ఇజ్రాయేల్‌కి చెందిన బందీలే (Israel Hostages Killed) అని గుర్తించి తప్పు తెలుసుకుంది. గాజాలోనే ఉగ్రవాదులపై దాడులు చేసే సమయంలో ఈ పొరపాటు జరిగిందని వివరించింది. ఈ ఘటనపై Israel Defense Forces (IDF) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఇలా జరిగుండాల్సింది కాదని విచారం వ్యక్తం చేసింది. బందీలను విడిపించి తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. అయితే..ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే టెల్‌ అవీవ్‌లో వందలాది మంది పౌరులు నిరసన వ్యక్తం చేశారు. IDF మిలిటరీ బేస్ వైపు దూసుకెళ్లారు. మిగతా  బందీలకు ఏమీ కాకముందే వెంటనే విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు కూడా స్పందించారు. ఇది చాలా దురదృష్టకమరమని విచారం వ్యక్తం చేశారు. చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు. మిగతా బందీలను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. అటు ఇజ్రాయేల్ ఆర్మీ కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. పూర్తి  బాధ్యతను తీసుకుంటున్నట్టు ప్రకటించింది. పౌరుల ప్రాణాల్ని కాపాడడమే తమ ప్రాధాన్యత అని తేల్చి చెప్పింది.  






అక్టోబర్ 7న హమాస్ దాడులతో మొదలైన ఈ విధ్వంసం ఇంకా కొనసాగుతోంది. అయితే...హమాస్‌ని అంతం చేయడానికి ఇజ్రాయేల్ "Dumb Bombs"ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నట్టు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. అమెరికా చెందిన Director of National Intelligence ఆఫీస్ ఈ రిపోర్ట్‌ని విడుదల చేసింది. CNN వెల్లడించిన వివరాల ప్రకారం...ఇజ్రాయేల్ చేసిన దాడుల్లో 45% మేర ఎయిర్‌ స్ట్రైక్స్‌ ఉన్నాయి. ఇందుకోసం దాదాపు 29 వేల ఆయుధాలను వినియోగించింది. అయితే..ఈ దాడుల తీవ్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారీ మొత్తంలో ప్రాణనష్టం నమోదయ్యే ప్రమాదముందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉండే గాజాపై ఇలాంటి దాడులు చేయడం వల్ల ఎక్కువ మంది పౌరులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది.


Also Read: మీరు యాపిల్ ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త - ఈ ప్రమాదం తప్పదేమో!