భూమిపై అత్యంత ప్రాణాంతకమైన మరియు విషపూరితమైన జీవుల‌్లో పాములు స్థానం పొందాయి. ఎంత ధైర్య వంతులైనా సరే పాము చూశారంటే చాలు ఒక్కసారిగా ఒళ్లు జల్లుమంటుంది. అందుకే పాము పేరు వింటేనే చాలా మంది ఆమడ దూరం పారిపోతారు. పట్టుకోమంటే చాలు ప్రాణాలు వదిలేస్తారు. చాలా పాములు ప్రమాదకరమైనవి కావు. విషపూరితం కానీ పాము కరిచినా ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే  పాము కరిస్తే ఏమైపోతుందో అన్న భయమే చాలా మంది ప్రాణాలు తీస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 81,000 నుంచి 1,38,000 మంది పాముకాటు కారణంగా మరణిస్తున్నారు. 


పాము కాటుతో చాలా మంది జీవితాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కానీ కొన్ని సంఘటనలు ప్రజలను పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. అందులో ఓ మహిళ చెవిలో చిన్న పాము దూరింది. ఇలా వీడియో ఒకటి విడుదలై సంచలనం సృష్టించింది.






వీడియోలో ఉన్నదెవరో, అది ఎక్కడ జరిగిందో కూడా తెలియదు కానీ ఒక మహిళ చెవిలో పసుపు పాము మాత్రం కనిపిస్తోంది. చెవిలో నుంచి బయటపడేందుకు ఆ పాము ప్రయత్నిస్తున్నట్టు అందులో కనిపిస్తోంది. చేతి తొడుగులు ధరించిన వైద్యుడు ఆ చెవిలో నుంచి పామును బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు.


పాము తల మాత్రమే స్త్రీ చెవి నుంచి బయటకు వస్తుంది. డాక్టర్ అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, ఆమె చెవిలో ఉన్న పాము తన నోరు తెరుచుకుంటుంది, మూసుకుంటుంది. డాక్టర్ దాన్ని బయటకు తీయడానికి అన్ని ప్రయత్నాలు చేసినా అది ఫలించలేదు.