Snake in Electric Equipment:



సబ్‌స్టేషన్‌లో పాము 


అమెరికాలోని ఆస్టిన్‌లో పవర్‌ కట్‌..దాదాపు 16 వేల మందిని చీకట్లోకి నెట్టేసింది. ఎంతకీ కరెంట్ రాకపోవడం వల్ల అసలేమైందని ఆరా తీశారు స్థానికులు. అప్పుడే అసలు విషయం తెలిసింది. దగ్గర్లోని ఓ సబ్‌స్టేషన్‌లో పాము దూరింది. ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్‌లో పాము వెళ్లడం వల్ల ఆ పరికరం పాడైంది. సడెన్‌గా పవర్ కట్ అయింది. మే 16వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు కరెంట్ పోగా...రెండ్రోజుల తరవాత ఇందుకు కారణమేంటో తెలిసింది. ఎలక్ట్రిక్ సర్క్యూట్‌పై నుంచి పాము వెళ్లడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయింది. ఫలితంగా పవర్ పోయింది. పవర్ గ్రిడ్‌లో టెక్నికల్‌గా ఎలాంటి సమస్య తలెత్తలేదని అధికారులు వెల్లడించారు. పాము కారణంగానే పవర్ కట్ అయిందని స్పష్టం చేశారు. 


"గ్రిడ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఓ పాము కారణంగా పవర్ కట్ అయింది. సబ్‌స్టేషన్‌లోని ఎలక్ట్రిఫైడ్ సర్క్యూట్‌లోకి దూరడం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇక్కడ పవర్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే...వీలైనంత వరకూ సమస్య రాకుండానే చూసుకుంటాం. కానీ...ఇలా అప్పుడప్పుడు పాములు వచ్చి దూరడం వల్ల మాకు సవాళ్లు ఎదురవుతున్నాయి. వీలైనంత త్వరగా రీస్టోర్ చేయడానికే ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయాల్లో ఎలా రిపేర్ చేయాలో కూడా అర్థం కాదు. అందుకే సమయం పడుతుంది"


- అధికారులు 










గతేడాది జపాన్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. దాదాపు 10 వేల కుటుంబాలకు పవర్ కట్ అయింది. సబ్‌స్టేషన్‌లోని ఎలక్ట్రిక్‌ ఎక్విప్‌మెంట్‌లోకి పాము దూరి షాక్‌ కొట్టి చనిపోయింది. ఈ కారణంగా పవర్ సప్ల్లైకి అంతరాయం కలిగింది. కప్పలు, పాములు గ్లోబల్ ఎకానమీని దెబ్బ తీస్తున్నాయి. వాటి వల్లే వందల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఓ అధ్యయనం చెప్పిన సంగతి ఇది. కేవలం కప్పలు, పాముల వల్ల దాదాపు 16 బిలియన్ డాలర్ల మేర ప్రపంచ ఎకానమీ నష్టపోవాల్సి వస్తోందని తేల్చి చెప్పింది ఆ స్టడీ. అమెరికన్ బుల్‌ఫ్రాగ్‌, బ్రౌన్‌ ట్రీ స్నేక్ కారణంగా...1986 నుంచి 2020 వరకూ జరిగిన నష్టమిదని వెల్లడించింది. అమెరికన్ బుల్‌ఫ్రాగ్‌లు పంట పొలాల్ని నాశనం చేస్తుండగా, బ్రౌన్ ట్రీ స్నేక్‌లు ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్‌లపైకి ఎక్కి విలువైన వాటిని డ్యామేజ్ చేస్తున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. బ్రౌన్ అండ్ గ్రీన్ ఫ్రాగ్‌లను లితోబేట్స్‌ కాటెస్‌బియానస్ గా పిలుస్తారు. వీటి బరువు 2 పౌండ్లు. అంటే 0.9 కిలోలు. ఐరోపాలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు ఈ రీసెర్చ్ నిర్ధరించింది. ఇక బ్రౌన్‌ ట్రీ స్నేక్‌లను బొయిగా ఇర్రెగ్యులారిస్‌గా పిలుస్తారు. పసిఫిక్ ఐల్యాండ్స్‌లో వీటి సంతతి అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. ఈ ప్రాంతంలోని విద్యుత్ పరికరాలపై పాకుతూ, అవి పని చేయకుండా చేస్తున్నాయి ఈ పాములు. 


Also Read: Modi Hugs Biden: జో బైడెన్‌ని కౌగిలించుకున్న ప్రధాని మోదీ, ఆత్మీయంగా పలకరింపు