Modi Hugs Biden:
జీ 7 సదస్సులో ఘటన..
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని హిరోషిమాలో G-7 సమ్మిట్‌కి (G7 Summit) హాజరయ్యారు. ఇదే సదస్సుకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా వచ్చారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రధాని మోదీ తనకు కేటాయించిన కుర్చీలో కూర్చుని ఉన్నారు. అప్పుడే జో బైడెన్ అక్కడికి వచ్చారు. బైడెన్‌ని గమనించిన వెంటనే ప్రధాని మోదీ కుర్చీలో నుంచి లేచారు. మర్యాదపూర్వకంగా ఆయనను పలకరించారు. అంతే కాదు. ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. క్వాడ్ సమ్మిట్‌కి ముందు ఈ ఇద్దరూ ఇంత స్నేహపూర్వకంగా కనిపించడం ఆసక్తికరంగా మారింది. జూన్ 21-24 మధ్యలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు మోదీ. హిరోషిమాలో ల్యాండ్ అయిన వెంటనే జపాన్ ప్రధాని కిషిద మోదీని సాదరంగా ఆహ్వానించారు. G-7 సదస్సుకి హాజరైన ఆయన..జపాన్-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. వాతావరణ మార్పులపైనా కీలక చర్చలు జరిపారు. త్వరలోనే G-20 సదస్సుకి భారత్ అధ్యక్షత వహించనుంది. దీనిపైనా ఇద్దరి మధ్యా చర్చ జరిగింది. ఆ తరవాత ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీతోనూ భేటీ అయ్యారు ప్రధాని మోదీ.
గాంధీ విగ్రహ ఆవిష్కరణ..
G7 సమావేశానికి హాజరయ్యే ముందు ఆయన ఇక్కడ ఫ్యూమియోతో సమావేశమై మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచానికి శాంతి సందేశాన్ని కూడా అందించారు. హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని స్థాపించి, ఆవిష్కరించే అవకాశం కల్పించినందుకు జపాన్ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మహాత్మా గాంధీ ఆశయాలను మనమంతా పాటించి ముందుకు సాగాలని అన్నారు. ఇదే మహాత్మా గాంధీకి నిజమైన నివాళి అవుతుందన్నారు. నేటికీ హిరోషిమా పేరు వింటేనే ప్రపంచం వణికిపోతుందని మోదీ అన్నారు. G7 సమావేశంలో అతను మొదట గౌరవనీయమైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. అయితే హిరోషిమా నేడు ప్రపంచం వాతావరణ మార్పులకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోందన్నారు. వాతావరణ మార్పులతో యుద్ధంలో విజయం సాధించాలంటే పూజ్య బాపు ఆదర్శం అని అన్నారు. అతని జీవనశైలి ప్రకృతి పట్ల గౌరవం, సమన్వయం, అంకితభావానికి సరైన ఉదాహరణ అన్నారు. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన భారతీయ ప్రజలను కూడా కలిశారు.