mahabubabad News : ఏడ్చినా , నవ్వినా కళ్ల నుంచి కన్నీరొస్తాయని వేదాంతంగా చెప్పుకుంటాం కానీ మహబూబాబాద్ జిల్లాలో ఓ చిన్న పాపకు మాత్రం కంటి నుండి అదేపనిగా ప్లాస్టిక్,ఇనుము,పేపర్ ముక్కలు వస్తున్నారు. కంటి నుంచి ప్లాస్టిక్,ఇనుము,పేపర్ ముక్కలు రావడం ఏమిటని ఆ పాప భయపడిపోతోంది. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
గార్ల మండలం పెద్ద కృష్టాపురం గ్రామంానకిి భూక్య సౌజన్య ఒకటో తరగతి చదువుతోంది. కొద్ది రోజులుగా కళ్లు మంటలుగా ఉంటాయి. హఠాత్తుగా కళ్ల నుండి ప్లాస్టిక్,ఇనుము,పేపర్ ముక్కలు రావడం ప్రారంభమయింది. రోజులు గుడుస్తున్నా తగ్డంలేదు. దీంతో కృష్టాపురం వాసులు వితంగా చూస్తున్నారు. ఖమ్మం హస్పటల్ కి తరలించారు. పాపను ప్రభుత్వమే అదుకోవాలని తల్లిదండ్రులు.. .బంధువుల కోరుతున్నారు. ఆర్ధిక స్థోమత లేక పెద్ద హస్పిటల్ కి తీసుకపోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఇలా కళ్ల నుంచి రాళ్లు, ఇనుప ముక్కలు వంటివి రావడం తరచూ జరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందట జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని చెందిన నంద్యాల రంగన్న-లక్ష్మి దంపతులు పాప దీపాళి కండ్లలో నుంచి చిన్న రాళ్లు, బియ్యం గింజలు వస్తున్నాయి. ఇంటి పక్కల వారికి, స్థానిక వైద్యులకు చూయించిన ఎవరూ నమ్మలేదు. కంటి నుంచి నీరు కారడంతో పాటు రాళ్లు, బియ్యం గింజలు వచ్చే సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది. దీంతో చికిత్స నిమిత్తం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి బాలికను తరలించారు. అక్కడ వైద్యులు స్కానింగ్ పరీక్షలు నిర్వహించి.. ఏం సమస్యలేదని చెప్పి పంపారు. ప్రతి రోజూ 10 నుంచి 12 చిన్న చిన్న రాళ్లు బయటకు వస్తున్నాయి. కంటి నుంచి నీరుతో పాటు రాళ్లు, బియ్యం గింజలు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికీ ఆ పాప సమస్య పరిష్కారం కానట్లుగా చెబుతున్నారు.
ఇలాంటి సమస్యలకు గరువుతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో కొంత మందిపెద్ద వారికి కూడా ఇలాంటి సమస్య వచ్చింది. ఆహారపు అలవాట్ల వల్ల వస్తాయని కొంత మంది నేత్ర వైద్య నిపుణులు చెబుతున్నారు కానీ.. ఖచ్చితంగా ఇదే కారణం అని సైంటిఫిక్ విశ్లేషణ ఇంత వరకూ జరగలేదని చెబుతున్నారు. అయితే ఇలాంటి వారి కళ్లను అత్యాధునిక వైద్య శాలల్లో టెస్టులు చేసినా ఎలాంటి సమస్యా కనిపించడం లేదు. దాంతో డాక్టర్లు కూడా ఎలాంటి చికిత్సను ప్రిపర్ చేయడం లేదని చెబుతున్నారు. అలాంటివి రాకుండా చేయడానికి కొన్ని ఐ డ్రాప్స్ ప్రిఫర్ చేస్తున్నప్పటకీ పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. కొన్నాళ్లకు ఆగిపోతాయని వైద్యులు చెబుతున్నారు. కానీ ఇలాంటి వి కళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు బాధితులు అల్లాడిపోతున్నారు.
పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలా కళ్ల నుంచి రాళ్లు, పేపర్ ముక్కలు బయటకు రావడం వల్ల అనేక రకాల మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు. ఫలితం బాధితులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు.