ఆంధ్రప్రదేశ్‌లో ప్రజావ్యతిరేక పాలన సాగుతుందని భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు. జగన్ పాలనతో ఎవరూ సంతోషంగా లేరన్నారు. అన్ని రంగాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ఛార్జిషీటు పేరుతో బీజేపీ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. 


గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వం అవినీతి పై ఛార్జిషీటు సిద్దం చేశారని అన్నారు పురంధేశ్వరి. వాటిని అన్ని స్థాయిల్లో సభలు పెట్టి ప్రజలకు వివరిస్తామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన జగన్‌ పై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. 


ఏ ఒక్క వర్గం జగన్ పాలనపై సంతృప్తిగా లేరనేది వాస్తవమని కామెంట్ చేశారు పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. మోడీ తొమ్మిదేళ్ల పాలన సందర్భంగా నెల రోజుల పాటు కార్యక్రమం చేపట్టామని వివరించారు. ఈ రెండు అంశాలపై రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చ జరిగిందన్నారు.


అంతర్గత విషయాలు చెప్పం....సొము వీర్రాజు..
రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో అంతర్గతంగా జరిగే వివరాలను గురించి మీడియాకు వివరించలేమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజు తెలిపారు. పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి అనుచరులు మీడియాపై దాడిని ఖండిస్తున్నామని అన్నారు. ప్రస్టేషన్‌లో ఉన్న అవినాష్ రెడ్డి దాడులు చేయించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. గుమ్మడి కాయ దొంగ తరహాలో అవినాష్ రెడ్డి తీరు ఉందని ధ్వజమెత్తారు. 
పొత్తుల అంశం ఎన్నికల సమయంలో అధిష్ఠానం నిర్ణయం తీసుకుటుందన్నారు సోమువీర్రాజ. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను జాతీయ నాయకులకు ఎప్పటికప్పుడు ‌వివరిస్తూనే ఉన్నామన్నారు. తాజా రాజకీయ పరిస్థితులతోపాటుగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల పరిస్థితులు, వాటి బలాబలాలు గురించి కూడా కేంద్ర నాయకత్వం ఆరా తీస్తోందన్నారు. అన్నింటిని పరిశించిన తరువాత కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు. 


పార్టీలో ఎవరైయినా క్రమశిక్షణ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు సోమువీర్రాజు. సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తున్న భారతీయ జనతా పార్టీని గ్రామస్థాయిలో కూడా మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సొము వీర్రాజు వెల్లడించారు.


ఎవరి కోసం యాగాలు చేస్తున్నారు...
విజయవాడ నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆరు రోజుల పాటు భారీ ఎత్తున జరిగిన రాజశ్యామల యాగం ఎవరి కోసం చేశారో చెప్పాలని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎవరి తృప్తి, ఎవరి మెప్పు కోసం చేశారో చెప్పాలన్నారు. సిఎం కుటుంబం బాగుండాలని దేవాదాయ శాఖ డబ్బుతో యాగాలు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలు ఎలా పోయినా ముఖ్యంత్రి జగన్‌కు ఫర్వాలేదా అని, ఆయన కుటుంబం మాత్రమే బాగుండాలని కోరుకుంటున్నారా అని నిలదీశారు. సిఎం తీసుకున్న సంకల్పం కూడా వింతగా ఉందని విమర్శించారు. ఇలాంటి విధానం మేమెప్పుడూ‌ చూడలేదు, వినలేదన్నారు. వీటికి దేవదాయ శాఖ మంత్రి సమాధానం‌ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయటం సరికాదన్నారు. ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత నిధులు తెచ్చారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.


Also Read: నేడు గవర్నర్ ని కలవనున్న సోము వీర్రాజు, పోలీసుల దమనకాండపై ఫిర్యాదు


Also Read:  పొత్తులుంటాయని బీజేపీ క్లారిటీ - ఎవరితో అంటే ?