Siddaramaiah vs DK Shivakumar:



డీకే శివకుమార్ కామెంట్స్..


కర్ణాటక సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్దరామయ్య ఉన్నారు. ఇద్దరూ కాంగ్రెస్‌కి కీలక నేతలే. అందుకే ఎవరిని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలన్న సందిగ్ధంలో ఉంది హైకమాండ్. ఇది పక్కన పెడితే...ఇద్దరి నేతల మధ్య విభేదాలున్నాయన్న వాదనలూ వినిపించాయి. అందుకే...సీఎం పేరు ప్రకటించడంలో ఆలస్యమవుతోందనీ కొందరు ప్రచారం చేశారు. అయితే...ఈ పుకార్లకు డీకే శివకుమార్ చెక్ పెట్టారు. సిద్దరామయ్యతో విభేదాలున్నాయన్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. చాలా సందర్భాల్లో సిద్దరామయ్యకు మద్దతుగా నిలిచానని స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని వెల్లడించారు. 


"సిద్దరామయ్యతో నాకు విభేదాలున్నాయని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. కానీ...ఈ విషయంలో మీకో క్లారిటీ ఇస్తున్నాను. అలాంటి విభేదాలేవీ మా మధ్య లేవు. చాలా సార్లు నేను పార్టీ కోసం త్యాగాలు చేశాను. సిద్దరామయ్యకు నా ఫుల్ సపోర్ట్ ఇచ్చాను. ఆయనకు ఎప్పుడూ మద్దతుగా ఉన్నాను"


- డీకే శివకుమార్, కాంగ్రెస్ నేత