Telecom Ministry New Portal:


మే 17 న అందుబాటులోకి..


మొబైల్‌ పోయిందంటే పెద్ద ప్రహసనం. ట్రాకింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే తప్ప అది ఎక్కడ పోయిందో కనుక్కోవడం కష్టం. కంప్లెయింట్ ఇవ్వడం...పోలీసులు దాన్ని ట్రాక్ చేయడం..ఇదంతా చాలా టైమ్‌తో కూడుకున్న పని. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ కొత్త ఆలోచనతో ముందుకొస్తోంది. మే 17న ప్రపంచ టెలికాం అండ్ ఇన్‌ఫర్మేషన్ సొసైటీ డే సందర్భంగా కేంద్రం కొత్త పోర్టల్‌ అందుబాటులోకి తీసుకురానుంది. www.sancharsathi.in పేరిట పోర్టల్‌ను లాంఛ్ చేయనుంది. మొబైల్ పోగొట్టుకున్న వాళ్లు ఈ  పోర్టల్‌లో ట్రాక్ చేసుకోవచ్చు. లక్షలాది మందికి ఇది ఉపయోగపడనుంది. కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ మే 17న ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా ఇది అందుబాటులోకి వస్తుంది. ఇప్పటి వరకూ ఈ పోర్టల్ కేవలం ఢిల్లీ, ముంబయిలోనే అందుబాటులో ఉంది. ఇప్పటి వరకూ మిస్ అయిన మొబైల్స్‌లో 4 లక్షల 77 వేల ఫోన్స్‌ని బ్లాక్ చేశారు. అంతే కాదు. 2 లక్షల 40 వేల మొబైల్స్‌ని ట్రాక్ చేశారు. 8 వేల ఫోన్‌లను రికవర్ చేశారు. ఈ పోర్టల్ సాయంతో మొబైల్‌నే కాదు. సిమ్‌కార్డ్ నంబర్‌లనూ ట్రాక్ చేసుకోవచ్చు. మన నంబర్‌నే వేరే వాళ్లు యూజ్ చేస్తుంటే...వెంటనే బ్లాక్ చేయొచ్చు. ఈ పోర్టల్‌లో మరో కీలక ఆప్షన్ కూడా ఉంది. మనం కొన్నిసార్లు సెకండ్ హ్యాండ్‌ మొబైల్స్ కొనుగోలు చేస్తాం. కొంత మంది ఎక్కడో కొట్టేసి వాటిని వేరే వాళ్లకు అంటకడుతుంటారు. ఇలాంటి మోసాలనూ పసిగట్టేందుకు ఈ పోర్టల్‌లో ఆప్షన్ ఉంది. 


యాప్ కూడా..


 ఇప్పటికే..టెలికాం మంత్రిత్వ శాఖ సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR ) యాప్ ప్రవేశపెట్టింది. ఇందుకోసం www.ceir.gov.in  వెబ్ సైట్లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయాలి. పోయిన ఫోన్ లోని నంబర్లు, ఐఏంఇఐ నంబర్లు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు ఎక్కడ పోయింది, రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడీ, ఓటీపీ (OTP) కోసం మరో ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది సంబంధిత ఐడీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మొబైల్ ఏ కంపెనీ అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఫోన్ పని చేయకుండా చేస్తుంది. ఫోన్  దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్లోకి వెళ్లి ఆన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలి. ఐడీ నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. ఫోన్ పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించాలి. CEIR యాప్ సద్వినియోగం చేసుకోవాలి.  CEIR యాప్ లో సమాచారం నమోదు చేస్తే పోయిన మొబైల్ ఫోన్ త్వరగా దొరకడానికి అవకాశం ఉంటుంది.


Also Read: Karnataka Next CM: కర్ణాటక సీఎం పదవిపై వీడని ఉత్కంఠ, పోస్టర్లు ఫ్లెక్సీలతో అభిమానుల యుద్ధం