US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కొలరాడోలోని నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మరో 18 మందికి గాయాలయ్యాయి.


ఇదీ జరిగింది


శనివారం రాత్రి 11.57 గంటలకు కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. నైట్‌ క్లబ్‌లోకి చొరబడిన ఓ సాయుధుడు.. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మందికి గాయాలయ్యాయి.






సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. 


Also Read: Gujarat Elections 2022: భాజపా షాకింగ్ నిర్ణయం- ఏడుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు!