Shiv Sena Symbol: పార్టీ పేరు గుర్తు కోసం కోట్లు ఖర్చు చేశారు , త్వరలోనే ఈ డీల్‌ వివరాలు బయటకొస్తాయ్ - సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

Shiv Sena Symbol:సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు.

Continues below advertisement

Shiv Sena Symbol:

Continues below advertisement

డీల్ కుదిరింది: సంజయ్ రౌత్

శివసేన పార్టీ పేరు, గుర్తుని శిందే వర్గానికి కేటాయించడంపై థాక్రే సేన తీవ్ర అసహనంతో ఉంది. ఇప్పటికే ఉద్దవ్ థాక్రే ఎన్నికల సంఘంపై మండి పడ్డారు. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఇప్పుడు మరో సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా స్పందించారు. సంచలన ఆరోపణలు చేశారు. శివసేన పార్టీ పేరు, గుర్తు దక్కించుకునేందుకు శిందే వర్గం దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇదేదో నోటి మాట కాదని. ఇది నిజమని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయని వెల్లడించారు. దేశ చరిత్రలోనే ఇలాంటిదెప్పుడూ జరగలేదని అన్నారు. 

"మా పార్టీ పేరుని, గుర్తుని దొంగిలించారు. త్వరలోనే ఆ దొంగ ఎవరో తేలిపోతుంది. మేమే స్వయంగా విచారిస్తాం. ఇందుకు కచ్చితంగా బదులు తీర్చుకుంటాం" 

 - సంజయ్ రౌత్

 

Continues below advertisement