Shiv Sena Symbol Controversy:


మహారాష్ట్ర రాజకీయాల్లో కొన్ని నెలలుగా శివసేన పార్టీ పేరు, గుర్తుపై పోరు కొనసాగుతోంది. ఠాక్రే, షిందే గ్రూపుల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది. ఎన్నికల సంఘం ఆ పార్టీ పేరుని, గుర్తిని షిందే వర్గానికి కేటాయించిన తరవాత ఈ వైరం ఇంకా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్ర అంటూ థాక్రే వర్గం తీవ్రంగా మండి పడుతోంది. ఇప్పటికే ఈ విషయమై సుప్రీంకోర్టుని ఆశ్రయించింది థాక్రే వర్గం. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేసింది. అయితే దీనిపై ఎన్నికల సంఘమూ స్పందించింది. తాము తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంది. శివసేన పార్టీ పేరుని,గుర్తుని షిందే వర్గానికి కేటాయించడం సరైన నిర్ణయమే అని వెల్లడించింది. చట్టప్రకారమే నిర్ణయం తీసుకున్నామని తేల్చి చెప్పింది. థాక్రే వర్గం వేసిన పిటిషన్‌కు ఈ బదులు ఇచ్చింది. 


"శివసేన పార్టీ గుర్తుని షిందే వర్గానికి కేటాయించడాన్ని సమర్థించుకుంటున్నాం. అన్ని కోణాల్లో పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఉద్దవ్ థాక్రే ప్రస్తావించిన అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాం. ఆ తరవాతే ఈ కీలక ప్రకటన చేశాం"


- ఎన్నికల సంఘం