ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ పరిధిలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో కొత్తగా 1,610 పోస్టులను సృష్టిస్తూ ఏపీ ప్రభుత్వం మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న 88 పీహెచ్‌సీల కోసం 1,232 పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. సీహెచ్‌సీ ఉన్న 63 మండలాల్లో సీహెచ్‌సీ కేంద్రంగా వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేయడానికి మిగిలిన 378 పోస్టులను కేటాయించింది. అంతేకాకుండా మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగానే కొత్తగా ఏర్పాటు చేయనున్న 88 పీహెచ్‌సీల కోసం 1,232 పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. సీహెచ్‌సీ ఉన్న 63 మండలాల్లో సీహెచ్‌సీ కేంద్రంగా వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేయడానికి మిగిలిన 378 పోస్టులను కేటాయించింది.
ప్రభుత్వం కొత్తగా సృష్టించిన ఉద్యోగాల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 302 పోస్టులు, స్టాఫ్ నర్స్ - 264 పోస్టులు, ఎంపీహెచ్‌ఈవో/సీహెచ్‌వో - 151 పోస్టులతోపాటు ఇతర ఖాళీలు ఉన్నాయి. కాగా ఇప్పటికే వైద్యశాఖలో ప్రభుత్వం 48 వేలకు పైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిన సంగతి విదితమే. కొత్తగా భర్తీచేసే సిబ్బందితో వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి.
ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్..
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టిందని, త్వరలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. వైద్యశాఖలోని అన్ని విభాగాల అధిపతులతో సోమవారం మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో మంత్రి రజిని 2023–24 బడ్జెట్ అంచనాలు, వైఎస్సార్ కంటివెలుగు, ఆరోగ్యశ్రీ, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, 104 వాహనాలు, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్‌పై సమీక్షించారు.
ఆమె మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ జిల్లా నోడల్ అధికారులు తమ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌ను పరిశీలించి లోటుపాట్లు ఉంటే సరిచేయాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో ఎక్కడా వైద్య సిబ్బంది కొరత ఉండటానికి వీల్లేదని స్పష్టంచేశారు. మందులషాపుల్లో మత్తు మందులు, ఇతర అనధికారిక విక్రయాలను అరికట్టాలని ఔషధ నియంత్రణ విభాగాన్ని ఆదేశించారు.‘వైఎస్సార్ కంటివెలుగు’ మూడో దశలో భాగంగా 35,42,151మంది వృద్ధులకు ఆరు నెలల్లో స్క్రీనింగ్ పూర్తి చేయాలని చెప్పారు.
అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయాలని, మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. చికిత్స కోసం వచ్చే రోగులకు ఇంటి నుంచి ఆస్పత్రికి, చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి ఇంటికి చేర్చడానికి రవాణా సౌకర్యం కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. 146 కొత్త 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ అందుబాటులోకి వస్తున్న దృష్ట్యా పాతవాటిలో ఎన్ని ‘మహాప్రస్థానం’ సేవలకు పనికొస్తాయో చూడాలన్నారు.
Also Read:
DMHO: తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!
కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, నేషనల్ హెల్త్ మిషన్(అర్బన్) ఒప్పంద ప్రాతిపదికన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 13 నుంచి మార్చి 16 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ముంబయి పోర్ట్ అథారిటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వివరాలు ఇలా!
ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..