Shashi Tharoor on Cow Hug Day:
ట్విటర్‌లో సెటైర్..
ఫిబ్రవరి 14వ తేదీన Cow Hug Day జరుపుకోవాలంటూ కేంద్ర పశు సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. తీవ్ర విమర్శలు రావడం వల్ల రెండ్రోజులకో మరో ప్రకటన చేసింది. ఈ నిర్ణయాన్నివెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. అయితే...ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ తనదైన స్టైల్‌లో సెటైర్లు వేశారు. ప్రతి అంశానికీ ఫన్నీ టచ్ ఇస్తూ ట్వీట్‌లు చేయడం శశి థరూర్‌కు అలవాటు. ఈ విషయంలోనూ అదే చేశారు.
"నాకు తెలిసి కౌ హగ్ డే విషయంలో తప్పు దొర్లింది. కొందరు దీన్ని అపార్థం చేసుకున్నారు. అందరూ తమ పార్ట్‌నర్స్‌ని (Guy)ని కౌగిలించుకోవాలని చెప్పి ఉంటారు. కానీ కొందరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. Guy కిగా బదులుగా Gaay(ఆవు)అని పొరపడి ఉంటారు"
శశి థరూర్,కాంగ్రెస్ ఎంపీ
కౌ హగ్ డే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందా అని ప్రశ్నించగా...ఇలా ట్వీట్‌లో ఫన్నీగా రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికే సోషల్ మీజియాలో కౌ హగ్ డేపై బోలెడన్ని మీమ్స్ వచ్చాయి. కొందరు సపోర్ట్ చేస్తూ పోస్ట్‌లు పెడుతుండగా మరి కొందరు మీమ్స్ షేర్ చేస్తున్నారు. మొత్తానికి మాటల యుద్ధానికి దారి తీసింది. ఇది గమనించిన కేంద్ర పశుసంక్షేమ శాఖ కీలక ప్రకటన చేసింది. కౌ హగ్ డే జరుపుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించింది.
ఇదీ జరిగింది..
కేంద్ర పశుసంక్షేమ శాఖ రెండ్రోజుల క్రితం కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవానికి బదులుగా "Cow Hug Day" జరుపుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. వాలెంటైన్స్ డే...పాశ్చాత్య సంస్కృతికి చెందిందని..దానికి బదులుగా ఆవుని కౌగిలించుకుని వాటితో మన బంధాన్ని బల పరుచుకోవాలంటూ పిలుపునిచ్చింది. భారతదేశ సంస్కృతిలో ఆవులకు ప్రత్యేక స్థానముంది. "గోమాత" అని కొలుస్తారు కూడా. భారతీయులకు, గోవులకు ఉన్న విడదీయలేని అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పశు సంక్షేమ శాఖ లీగల్ అడ్వైజర్ వెల్లడించారు.
"భారత దేశ ఆర్థిక వ్యవస్థకు, సంస్కృతికి ఆవులే వెన్నెముక లాంటివి. వాటితోనే మన మనుగడ కొనసాగుతోంది. జీవ వైవిధ్యానికి అవి ప్రతీకలు. అందుకే కామధేను, గోమాత అని రకరకాల పేర్లతో పిలుచుకుంటాం. అమ్మలా మనకు అన్నీ సమకూర్చుతుంది. మానవత్వాన్నీ కాపాడుతుంది. గోమాతను పూజించే వాళ్లందరూ ఫిబ్రవరి 14వ తేదీన Cow Hug Day జరుపుకోండి. గోమాత ప్రాధాన్యతను గుర్తించండి"
- పశు సంక్షేమ శాఖ
Also Read: Turkey Earthquake: 94 గంటల పాటు శిథిలాల కిందే, బతకడం కోసం తన మూత్రం తానే తాగాడు