Shashi Tharoor: పార్లమెంటు మెట్ల పైనుంచి జారిపడిన కాంగ్రెస్ నేత శశిథరూర్!

ABP Desam   |  Murali Krishna   |  16 Dec 2022 05:22 PM (IST)

Shashi Tharoor: తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కాలికి గాయమైంది.

పార్లమెంటు మెట్ల పైనుంచి జారిపడిన కాంగ్రెస్ నేత శశిథరూర్!

Shashi Tharoor:  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ పార్లమెంటు మెట్లు దిగుతుండగా గురువారం జారిపడ్డారు. దీంతో ఆయన కాలికి గాయమైంది. పార్లమెంట్ సమావేశాలకు హాజరైన సందర్భంగా ఈ ఘటన జరిగింది.

జారిపడటంతో శశిథరూర్ ఎడమ కాలి మడమ బెణికింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. నడవలేని పరిస్థితిలో ఉన్నందున నియోజవర్గ పరిధిలో తాను హాజరుకావాల్సి ఉన్న కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు శశిథరూర్‌ ట్వీట్ చేశారు. కాలికి పాస్లర్‌ వేసి ఉన్న కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు.

ఒకింత అసౌకర్యానికి గురయ్యాను. పార్లమెంట్‌లో మెట్లు దిగుతున్నప్పుడు కాలు జారింది. ఎడమకాలి మడమ కాస్త బెణికింది. కొద్దిసేపు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, నొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రికి వెళ్లాను. ప్రస్తుతం నడవలేని పరిస్థితిలో ఉన్నాను. నియోజవర్గంలో కార్యక్రమాలను రద్దు చేసుకున్నాను.                       -    శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ

తవాంగ్‌ ఘర్షణపై

భారత్- చైనా సైనికుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణపై శశిథరూర్ స్పందించారు. చైనా విషయంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వ్యవహరించిన తీరుని గుర్తు  చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

1962లో చైనాతో యుద్ధం జరిగిన సయయంలో పార్లమెంట్‌లోని అందరి సభ్యులతో జవహర్ లాల్ నెహ్రూ మాట్లాడారు. సభ సజావుగా సాగేలా చూశారు. అందరి మాటా విన్నారు. దాదాపు 100 మంది ఎంపీలు ఆయనతో చర్చించారు. ఆ తరవాతే పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్చలు అవసరం అని ఆయన అప్పట్లోనే చెప్పారు. భాజపా మాత్రం కాంగ్రెస్‌పై దాడి చేయడమే పనిగా పెట్టుకుంటోంది. నెహ్రూ చైనా విషయంలో చాలా సాఫ్ట్‌గా ఉన్నారని విమర్శిస్తోంది. యుద్ధం వల్ల అప్పట్లో భారత్ బాగా నష్టపోయిందని ఏదో సాకులు చెబుతోంది. ఈ రెండు కారణాలు చూపించి కాంగ్రెస్‌పై దాడికి దిగుతోంది. - శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ

పార్లమెంట్‌లో జవాబుదారీతనం ఉండాలని శశిథరూర్ అన్నారు. జాతీయ భద్రత అంశమైనా, అందులో కొన్ని రహస్యంగా ఉంచాల్సినవైనా...కొన్నింటిపై మాత్రం తప్పకుండా చర్చించే అవకాశం కల్పించాలని సూచించారు. రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేదని థరూర్ అన్నారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, ఏదో పొడిపొడిగా వివరణ ఇచ్చారని..ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదని మండి పడ్డారు. 

Also Read: Viral Video: మంచులో ఒంటె ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా లేదుగా!

Published at: 16 Dec 2022 05:13 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.