Viral Video: మంచు చూస్తే ఎవరికైనా చాలా ఉత్తేజంగా ఉంటుంది. ఎంత పెద్ద వాళ్లైనా చిన్న పిల్లలైపోతారు. అదే జంతువులైతే.. వాటి ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు. తాజాగా ఓ ఒంటె దాని జీవితంలో మొదటిసారి మంచును చూసింది. ఇంకేముంది.. గెంతులేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసింది.






ఎడాది జీవితాలు 


సాధారణంగా భగభగ మండే ఎండల్లో, ఎడారి దారుల్లో ఒంటెలు జీవితం సాగిస్తాయి. ఎక్కువగా రాజస్థాన్ ఎడారుల్లో ఒంటెలు కనిపిస్తాయి. అయితే ఈ వీడియోలో మాత్రం ఒంటె.. మంచులో హాయిగా విహరించింది. ఆల్బర్ట్ అనే ఈ ఒంటె మొదటిసారి మంచును చూసి ఉత్సాహంగా గెంతులేసింది. పక్కనే ఉన్న గొర్రెలతో తన ఆనందాన్ని పంచుకుంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన నిమిషాల్లోనే ఈ వీడియో తెగ వైరల్ అయింది. ఒంటె ఆనందాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు.