Pakistan Comedy: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్ లో ఇప్పుడు దేశభక్తికి కొలతలు వేస్తున్నారు. మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీని తన నివాసానికి పిలుచుకున్న ప్రధాని షాబాజ్ షరీఫ్ బ్రేవరీ అవార్డును ఇచ్చారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య టెన్షన్ ప్రారంభమైన సమయంలో ఆఫ్రిది ఇష్టం వచ్చినట్లుగా భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ భారత్ కాళ్లపై పడి కాల్పుల విరమణ కు ఓకే చెప్పించుకున్న తర్వాత ర్యాలీ చేశాడు. పాకిస్తాన్ దే గెలుపని ప్రచారం చేశాడు. ఈ కారణంగానే షాబాద్ షరీఫ్ ఆయన దేశభక్తిని మెచ్చి అవార్డును ప్రధానం చేశారు.
ఈ అంశంపై పాకిస్తాన్ లోనే సైటైర్లు పడుతున్నాయి.. బూట్లు నాకడం తప్ప.. షాహిద్ ఆఫ్రిదీ ఏమీ చేయలేదని దానికే అవార్డు ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారు.
వైరల్ మీమ్స్ లో కొన్ని ఫోటోలతో ట్రోల్ చేయడం ప్రారంభించారు.,
యుద్ధం సమయంలో అటెన్షన్ కోసం వ్యాఖ్యలు చేశారని.. ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని పాక్ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు
అదే సమయంలో షాహిద్ ఆఫ్రిది ఎంత అవకాశవాదో వివరిస్తూ పలువురు ఫోటోలు పెడుతున్నారు.