Pakistan Used A Fake Image: భారత చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి దిగజారింది. 13 మిలటరీ కేంద్రాలను ధ్వంసం చేసినప్పటికీ, ముందు అసీం మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ఇచ్చి, ఇప్పుడు భారతదేశంపై దాడులు చేశామని ఫేక్ కథనాలు సృష్టించే ప్రయత్నం చేసి అబాసుపాలైంది.
అసీం మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ఇచ్చిన సందర్భంగా జరిగిన విందులో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఒక చిత్రాన్ని బహుమతిగా ఇచ్చారు. పాకిస్తాన్ సైన్యం ఆర్టిలరీ ఆపరేషన్ సింధూర్‌కు వ్యతిరేకంగా భారతదేశంపై ఎలా దాడి చేసిందో చూపిస్తూ ఈ చిత్రాన్ని బహుమతిగా ఇచ్చారు. చిత్రంలో అనేక మల్టిపుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌లు ఒకేసారి కాల్చడాన్ని చూపించారు. రాకెట్లు కాల్చడం వల్ల మంట కూడా వచ్చినట్టు చిత్రంలో కనిపిస్తోంది.
చైనా PLA-ఆర్మీ రాకెట్ ఫోర్స్ చిత్రంఫాక్ట్-చెక్‌లో చిత్రాన్ని పరిశీలించినప్పుడు, అది పాకిస్తాన్ సైన్యానికి సంబంధించినది కాదు, చైనా PLA-ఆర్మీ రాకెట్ ఫోర్స్‌కు సంబంధించినదని తెలిసింది. ఈ చిత్రం 2019 సంవత్సరానికి చెందినది, దీనిని చైనా సైన్యం ఒక యుద్ధ విన్యాసం సమయంలో తీసింది. ఈ చిత్రాన్ని చైనా PLA-ఆర్మీ వెబ్‌సైట్‌లో కూడా చూడవచ్చు. షెహబాజ్ షరీఫ్ మునీర్‌కు 2019 సంవత్సరానికి చెందిన చైనా సైన్యం చిత్రాన్ని బహుమతిగా ఇచ్చారని తెలిసిన వెంటనే పాకిస్తాన్ నవ్వులపాలైంది.
తప్పుడు వార్తను తమ విజయంగా ప్రచారం చేయడానికి ప్రయత్నంపాకిస్తాన్ తప్పుడు వార్తను తమ విజయంగా ప్రచారం చేయడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. ఆపరేషన్ సిందూర్ తర్వాత వెంటనే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇసాక్ డార్ తమ దేశ పార్లమెంట్‌లో లండన్ డైలీ టెలిగ్రాఫ్ స్టోరీ కటింగ్‌ను చూపిస్తూ భారత వైమానిక దళాన్ని వ్యంగ్యంగా చూపించడానికి ప్రయత్నించాడు, కానీ పాకిస్తాన్‌కు చెందిన ఒక వార్తాపత్రిక తన దేశ విదేశాంగ మంత్రి (ఉప ప్రధానమంత్రి) అబద్ధాన్ని బహిర్గతం చేసింది. డార్ పార్లమెంట్‌లో చూపించిన వార్తాపత్రిక కటింగ్ వాస్తవ హెడ్‌లైన్‌ను మార్చేశారు. దానిని ఫోటోషాప్ ద్వారా మార్చారాని పేర్కొంది.
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్అదేవిధంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఒక గ్లోబల్ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో భారత ఫైటర్ జెట్ గురించి చేసిన వాదనలకు మద్దతుగా సోషల్ మీడియాను ఉదహరించాడు. అంటే భారత చేతిలో ఓడిపోయిన తర్వాత తమ కోపాన్ని తీర్చుకోవడానికి పాకిస్తాన్ పాలకులు ఏ మేరకు తప్పుడు, నిరాధార వార్తలను ప్రచారం చేస్తున్నారో ఇది చూపిస్తుంది.