Is it underwear or a bag: మీకు ఉర్ఫీ జావెద్ తెలుసా ?. రీల్స్ చూసే వారందరికీ ఉర్ఫీ జావెద్ తెలుసు. చిత్ర విచిత్రమైన డ్రెస్సులు వేసుకుని ఎయిర్ పోర్టులోకి వెళ్లి వస్తూంటారు. కానీ విమానాలు ఎక్కరు. తన దుస్తులు , విచిత్రమైన ఫ్యాషన్ చూపించుకోవడానికే వస్తారు.
ఇప్పుడు అలాంటి ఉర్ఫీలు అన్ని చోట్లా తయారవుతున్నారు. అలాంటి ఒక ఫ్యాషన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వీడియోలో ఫ్యాషన్ పేరుతో ఆ వ్యక్తి చేసిన ప్రయోగం ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్ కు కూడా అందనంత దూరంలో ఉంది. వైరల్ వీడియోలో, ఒక వ్యక్తి మెట్రోలో భుజనానికి అండర్ వేర్ తగిలించుకుని వెళ్తున్నాడు. నిజానికి మొదటి సారి చూస్తే అది అండర్ వేర్ . కానీ ఇతనేంటి అని కాస్త తీక్షణంగా చూస్తే అర్థమవుతుంది.. అది అండర్ వేర్ కాదు బ్యాగ్ అని. ఆ వ్యక్తి తన లోదుస్తులతో బ్యాగ్‌ను తయారు చేశాడని మెట్రోలో వాళ్లు గుసగుసలాడుుకున్నారు.
అయితే ఈ వైరల్ వీడియో ఇక్కడిది కాదు. ఇతర దేశాలకు చెందిన వీడియో ఓ నెటిజన్ షేర్ చేయడంతో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను @dopaminegain అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేశారు, దీనిని ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు .షేర్ చేశారు. ఈ వీడియోపై ప్రజలు వివిధ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన ఆవిష్కరణను చూసిన ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, "నా లైఫ్ నా రూల్స్ " అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ బ్యాగ్ లోపల ఏమి ఉంటుందో అని ఒక నెటిజన్ డౌటానుమానం వ్యక్తం చేశాడు.