Suicide Bombings in Nigeria: నైజీరియాలో ఆత్మాహుతి దాడి అలజడి సృష్టించింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. బోర్నో స్టేట్‌లో ఈ దాడి జరిగిందని CNN వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తొలి పేలుడు సంభవించింది. ఓ పెళ్లి వేడుకలో ఈ దాడి జరిగింది. ఆ తరవాత ఓ హాస్పిటల్‌లో ఆ వెంటనే మరో ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయి. ఇలా వరుసగా మూడు చోట్ల దాడులు జరగడం వల్ల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ దాడుల్లో మహిళలతో పాటు చిన్నారులూ పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. బార్నో State Emergency Management డైరెక్టర్ జనరల్ బర్కిండో మహమ్మద్ సైదు వెంటనే అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్వోజా నగరంలోనే వరుసగా మూడు చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఇప్పటి వరకూ ఓ ఉగ్రసంస్థ కూడా తామే ఈ దాడి చేసినట్టు ప్రకటించలేదు. అయితే...ఓ సెక్యూరిటీ పోస్ట్‌పైనా దాడి జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కూడా దీనిపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
బోకో హరామ్ ఉగ్రవాదుల అరాచకాలు..
నిజానికి బోర్నో ప్రాంతం చాలా రోజులుగా వివాదాలకు (Bombings in Borno) కేంద్ర బిందువుగా మారిపోయింది. Boko Haram మిలిటెంట్‌లు ఇక్కడ ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. ఇస్లామిక్ స్టేట్‌తో కలిసి ఇక్కడ అలజడి సృష్టిస్తోంది. ఈ కారణంగానే ఇప్పటి వరకూ బోర్నో నుంచి 20 లక్షల మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ ఉగ్రవాదులు దాదాపు 40 వేల మందిని దారుణంగా హత్య చేశారు. 2014లో తొలిసారి ఈ గ్రూప్ గురించి ప్రపంచానికి తెలిసింది. ఒకేసారి 270 మందికిపైగా అమ్మాయిలను కిడ్నాప్ చేసింది. అప్పటి నుంచి వరుస పెట్టి కిడ్నాప్‌లు, హత్యలతో భయాందోళనలకు గురి చేస్తున్నారు బోహో హరమ్ ఉగ్రవాదులు. ప్రస్తుతానికి 18 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తున్నప్పటికీ...కనీసం 30 మంది మృతి చెందినట్టు స్థానిక మీడియా చెబుతోంది. బాంబు దాడులు జరిగిన వెంటనే నైజీరియా మిలిటరీ కర్ఫ్యూ విధించింది. గ్వోజా నగరాన్ని బోకో హరమ్ ఉగ్రవాదులు చాలా రోజులుగా టార్గెట్ చేస్తున్నారు. 2014లో పూర్తిగా ఈ సిటీని తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. ఆ తరవాత 2015లో నైజీరియా సేనలు పోరాటం చేసి తిరిగి ఆ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయినా ఇప్పటికి వాళ్ల ఆగడాలు ఆగడం లేదు.
Also Read: Joe Biden: సాయంత్రం 4 దాటితే అంతా అయోమయమే, బైడెన్ ప్రవర్తనపై సంచలన రిపోర్ట్