Major Credit Card Rules Changing From July 2024: జులై నెల నుంచి, దేశంలోని అతి పెద్ద బ్యాంకుల కస్టమర్లకు అందే క్రెడిట్ కార్డ్ సేవల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రివార్డ్ పాయింట్‌లు, రివార్డ్‌ పాయింట్‌ ప్రయోజనాలు, కొన్ని రకాల ఛార్జీలు రద్దు, కొన్ని లావాదేవీలపై ఫీజులు పెంపు, క్రెడిట్‌ కార్డ్‌ల విలువ తగ్గింపు వంటివాటివి ఖాతాదార్లు చూడబోతున్నారు.


జులై నెలలో అమల్లోకి వచ్చే క్రెడిట్ కార్డ్ సంబంధిత మార్పులు:


SBI కార్డ్ నియమాలు
జులై 15 నుంచి, కొన్ని రకాల క్రెడిట్ కార్డ్‌ల ద్వారా నిర్వహించే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డ్ పాయింట్‌లు ఇవ్వడాన్ని నిలిపేస్తున్నట్లు SBI కార్డ్ ప్రకటించింది. ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డ్ పాయింట్‌లు వర్తించని SBI క్రెడిట్ కార్డ్‌ల జాబితా చాలా పెద్దది. 


ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డ్ పాయింట్‌లు వర్తించని SBI క్రెడిట్ కార్డ్‌లు: 
ఎయిర్ ఇండియా SBI ప్లాటినం కార్డ్, ఎయిర్ ఇండియా SBI సిగ్నేచర్ కార్డ్, సెంట్రల్ SBI సెలెక్ట్+ కార్డ్, చెన్నై మెట్రో SBI కార్డ్, క్లబ్ విస్తారా SBI కార్డ్, క్లబ్ విస్తారా SBI కార్డ్ ప్రైమ్‌, దిల్లీ మెట్రో SBI కార్డ్, ఎతిహాద్ గెస్ట్ SBI కార్డ్, ఎతిహాద్ గెస్ట్ SBI ప్రీమియర్ కార్డ్, ఫాబ్‌ఇండియా SBI కార్డ్, ఫాబ్‌ఇండియా SBI కార్డ్ సెలెక్ట్‌, IRCTC SBI కార్డ్, IRCTC SBI కార్డ్ ప్రీమియర్, ముంబై మెట్రో SBI కార్డ్, నేచర్ బాస్కెట్ SBI కార్డ్, నేచర్ బాస్కెట్ SBI కార్డ్ ఎలైట్‌, ఓలా మనీ SBI కార్డ్, పేటీఎం SBI కార్డ్, పేటీఎం SBI కార్డ్ సెలెక్ట్‌, రిలయన్స్ SBI కార్డ్, రిలయన్స్ SBI కార్డ్ ప్రైమ్‌, యాత్ర SBI కార్డ్.


ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు
జులై 01 నుంచి, వివిధ క్రెడిట్ కార్డ్ సర్వీసులపై ఛార్జీలను రివైజ్‌ చేసింది. ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డ్ మినహా అన్ని రకాల క్రెడిట్‌ కార్డ్‌ల రీప్లేస్‌మెంట్ రుసుమును రూ. 100 నుంచి రూ. 200 వరకు పెంచింది.


ICICI బ్యాంక్ రద్దు చేసిన క్రెడిట్ కార్డ్ ఛార్జీలు: 
1. చెక్/క్యాష్ పికప్ ఫీజ్‌ -- ఒక్కో పికప్‌కు రూ. 100 రుసుము రద్దు
2. ఛార్జ్ స్లిప్ రిక్వెస్ట్‌ -- రూ. 100 రుసుము నిలిపివేత
3. డయల్ ఎ డ్రాఫ్ట్ ఫీజ్‌ -- డ్రాఫ్ట్ విలువ మొత్తంలో 3% డిడక్షన్‌ రూల్‌ రద్దు
4. ఔట్‌స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజ్‌ -- చెక్‌ విలువలో 1% డిడక్షన్‌ రూల్‌ రద్దు
5. 3 నెలలకు మించిన డూప్లికేట్ స్టేట్‌మెంట్ రిక్వెస్ట్‌ -- రూ.100 ఫీజ్‌ నిలిపివేత


సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్‌
క్రెడిట్ కార్డ్ అకౌంట్లు సహా అన్ని ఖాతాల మైగ్రేషన్‌ జులై 15 నాటికి పూర్తవుతుందని సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లకు యాక్సిస్ బ్యాంక్ సందేశాలు పంపింది. మైగ్రేషన్ పూర్తయిన తర్వాత, కస్టమర్లు కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లు తీసుకునే వరకు సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లు పని చేస్తాయని కూడా వెల్లడించింది. మైగ్రేషన్ తేదీ ముందు వరకు సంపాదించిన రివార్డ్‌ పాయింట్లు ఎప్పటికీ ముగియవు. మైగ్రేషన్ తర్వాత సంపాదించిన పాయింట్ల గడువు మూడేళ్ల తర్వాత ముగుస్తుంది. 


టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్
01 ఆగస్ట్ 2024 నుంచి, అర్హత కలిగిన UPI లావాదేవీలపై కస్టమర్‌లు 0.5% మొత్తాన్ని NeuCoins రూపంలో తిరిగి పొందుతారు. లావాదేవీ కోసం Tata Neu UPI IDని ఉపయోగిస్తే, అదనపు 1% మొత్తాన్ని NeuCoins రూపంలో పొందొచ్చు.


HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి.. క్రెడ్‌, పేటీఎం, చెక్‌, మొబిక్విక్‌, ఫ్రీఛార్జ్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా అద్దె చెల్లిస్తే అదనపు బాదుడు తప్పదు. ప్రతి లావాదేవీపై 1% లేదా గరిష్టంగా రూ. 3,000 వరకు ఫీజ్‌ను బ్యాంక్‌ వసూలు చేస్తుంది. ఆగస్టు 01, 2024 నుంచి ఈ నియమం అమలులోకి వస్తుంది.


మరో ఆసక్తికర కథనం: ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా తెలుగు వ్యక్తి!, దినేష్ ఖరా వారసుడిగా సిఫార్సు