Senegal Parliament Video: చట్టాలు చేయాల్సిన సభలో సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనలు మనం చాలానే చూశాం. కానీ తాజాగా సెనెగల్‌ పార్లమెంట్‌లో ఎంపీల మధ్య చెలరేగిన ఘర్షణ అంతకుమించి.


రచ్చరచ్చ


సెనెగల్ పార్లమెంటులో శుక్రవారం ఘర్షణ వాతావరణం నెలకొంది. సభ్యులు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సెనెగల్‌ ప్రతిపక్ష పార్టీ నాయకుడు మస్సాట్‌ సంబ్‌.. తోటి పార్లమెంట్‌ సభ్యురాలు యామి నదియా గింబేను తొలుత చెంపదెబ్బ కొట్టారు. దీంతో పార్లమెంట్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.


వెంటనే గింబే అక్కడే ఉన్న ఒక కుర్చీ తీసుకొని సంబ్‌ వైపు విసిరారు. దీంతో అక్కడే ఉన్న చట్టసభ సభ్యులు వారిని విడదీసేందుకు తీవ్ర యత్నాలు చేశారు. ఇరు పక్షాలు తీవ్రంగా దూషించుకొన్నాయి. ఫలితంగా పార్లమెంట్‌ సెషన్‌ను సస్పెండ్‌ చేశారు.






ఇందుకే గొడవ


ప్రస్తుత దేశాధ్యక్షుడు సాల్‌కు మూడోసారి పదవి కట్టబెట్టడానికి ఓ ఆధ్యాత్మిక గురువు వ్యతిరేకంగా ఉన్నారు. ఎంపీ గంబే దీనిని తప్పుపట్టారు. ఆమె వైఖరిపై ప్రతిపక్ష నాయకుడు సంబ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సదరు మహిళా ఎంపీ ఆయన్ను వెక్కిరించడంతో ఈ దాడి జరిగింది. వాస్తవానికి ఈ దేశంలో జులై నుంచి అధికార-ప్రతిపక్షాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. 


Also Read: Putin's Health: షాకింగ్ న్యూస్- మెట్లపై నుంచి జారిపడిన పుతిన్- విరిగిన ఎముక!