Stock Market Update: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు పీక్‌ స్టేజ్‌లో ఉన్నాయి. మరికొన్ని రోజుల వరకు NSE నిఫ్టీ 18,400- 18,900 రేంజ్‌లో కన్సాలిడేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వరుసగా 8 రోజులు విజయవంతంగా పరుగులు పెట్టిన నిఫ్టీ, శుక్రవారం 18,696 వద్ద ఆ పరుగును ముగించింది. ఇవాళ (సోమవారం) 18,719 వద్ద ఓపెన్‌ అయింది.


ఎక్స్‌పర్ట్‌: వికాస్ జైన్, సీనియర్ టెక్నికల్ & డెరివేటివ్ ఎనలిస్ట్, రిలయన్స్ సెక్యూరిటీస్‌


ఈ వారం నిఫ్టీ పయనం ఎటు వైపు?
ఇండియా విక్స్‌ (VIX) ప్రస్తుతం ఒక సంవత్సరం కనిష్ట స్థాయిలో, 14 కంటే దిగువలో ఉంది. నిఫ్టీ50 మరికొన్ని కొన్ని వారాల పాటు 18,400- 18,900 పరిధిలోనే తిరుగుతుందని ఇది సూచిస్తోంది. గ్యాప్‌ లెవెల్‌, స్వల్పకాలిక సగటు అయిన 18,450 వద్ద బలమైన మద్దతు ఉంది. రాబోయే వారాల్లో ఆర్‌బీఐ పాలసీ మీటింగ్‌, US FOMC సమావేశం నేపథ్యంలో 18,900ను దాటి నిఫ్టీ వెళ్లకపోవచ్చు.


పెట్టుబడిదారులు ఏం చేయాలి?
నిఫ్టీ నెక్స్ట్ 50, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌ ఇంకా కొత్త ఆల్ టైమ్ గరిష్టాలకు చేరలేదు కాబట్టి, వాటికి కేటాయింపులు పెంచాలి. ప్రస్తుత స్థాయిల నుంచి మరింత మెరుగైన పనితీరును ఇవి కనబరిచే అవకాశం ఉంది. నిఫ్టీ స్మాల్‌ క్యాప్ ఇండెక్స్ వీక్లీ చార్ట్‌లో బ్రేకవుట్‌ సాధించింది. ప్రస్తుత స్థాయిల్లో అశోక్ లేలాండ్, LIC హౌసింగ్ ఫైనాన్స్, ఓల్టాస్, హావెల్స్, క్రాంప్టన్, SBI కార్డ్స్, చోళ ఫైనాన్స్, సెయిల్, టాటా పవర్‌ మా బెట్స్‌.


ఎక్స్‌పర్ట్‌: మెహుల్ కొఠారి, ఏవీపీ - టెక్నికల్ రీసెర్చ్, ఆనంద్‌రాఠి షేర్స్‌


ఈ వారం నిఫ్టీ పయనం ఎటు వైపు?
కీలక స్థాయి అయిన 18,350 పైనే నిఫ్టీ కదలాడడాన్ని చూస్తే, మేజర్ రేంజ్‌ బ్రేకవుట్‌తో 21,000 మార్క్‌ వైపు ఇండెక్స్‌ వెళ్తుందని టెక్నికల్‌గా అర్ధమవుతోంది. అయితే, గ్లోబల్ స్పేస్‌లో కొన్ని అనిశ్చితుల కారణంగా, వన్‌ సైడెడ్‌ మూవ్‌ ఉంటుందని మాత్రం అనుకోకూడదు. అప్‌సైడ్‌లో, 19,000ను ఇండెక్స్‌ దాటితే ఆ ర్యాలీ 19,300 వైపుగా సాగుతుంది.


పెట్టుబడిదారులు ఏం చేయాలి?
మార్కెట్‌లో ఇప్పుడు బుల్లిష్ ట్రెండ్‌ నడుస్తోంది. మెరుగైన రిస్క్-రివార్డ్ కోసం ఒక షార్ప్‌ కరెక్షన్‌ ఇప్పుడు అవసరం. ట్రేడర్లు ఒక థీమ్‌ లేదా పూర్తి సెక్టార్‌ మీద ఫోకస్‌ పెట్టకుండా స్టాక్ స్పెసిఫిక్‌గా ఉండాలి. రూ. 515 స్టాప్ లాస్‌, రూ. 575 టార్గెట్‌తో రూ. 535కి సమీపంలో ICICI సెక్యూరిటీస్‌ను కొనుగోలు చేయవచ్చు. రూ. 820 స్టాప్ లాస్‌, రూ. 900 టార్గెట్‌తో రూ. 850కి సమీపంలో ఓల్టాస్‌ను కొనుగోలు చేయవచ్చు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.