Zombie Virus in Russia:


రష్యాలో..


ప్రస్తుత కాలంలో ఎప్పుడు ఏ వైరస్ వచ్చి అటాక్ చేస్తుందో అంతు పట్టడం లేదు. కొవిడ్‌ కథ ముగిసిందిలే అనుకునే లోగా..మంకీపాక్స్ వచ్చి కలకలం రేపింది. అక్కడక్కడా కొత్త వైరస్‌లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వాతావరణ మార్పులూ ఇందుకు ఓ కారణం. ఈ ఫలితంగా... మానవాళి ఏదో ఓ విపత్తుని ఎదుర్కొంటూనే ఉంది. అయితే...మానవాళికి ప్రమాదం కలిగించే 24 వైరస్‌లను ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో ఒకటి "జాంబీ వైరస్" (Zombie Virus).48,500 ఏళ్ల క్రితం నాటి ఈ వైరస్‌ను రష్యాలోని ఓ గడ్డకట్టిన సరస్సు కింద కనుగొన్నారు. సిబేరియాలో ఐరోపా శాస్త్రవేత్తలు ఈ వైరస్ శాంపిల్స్‌ని సేకరించారు. పరీక్షించిన తరవాత దీనికి "జాంబీ వైరస్" అనే పేరు పెట్టారు. ఇన్నేళ్ల పాటు మంచులో కూరుకుపోయినప్పటికీ...ఈ వైరస్‌కు వ్యాప్తి చెందే గుణం ఇప్పటికీ ఉందని వెల్లడించారు. Bloomberg రిపోర్ట్ ఇదే విషయాన్ని చెప్పింది. ఈ వైరస్‌కు " Pandoravirus Yedoma" అనీ పిలుస్తున్నారు. 2013లో ఇదే శాస్త్రవేత్తల బృందం 30 వేల ఏళ్ల నాటి వైరస్‌ను కనుగొన్నారు. ఇప్పుడా రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ...అంత కన్నా పాత "వైరస్‌"ను గుర్తించారు. ఇప్పుడు ఈ పరిశోధకులు వైరస్‌ను కనుగొన్న ప్రాంతం అతిశీతోష్ణస్థితిలో ఉంది. ఇక్కడి మంచు చాలా త్వరగా కరిగిపోతోందని గుర్తించారు. ఇదే కొనసాగితే...వాతావరణ మార్పుల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మీథేన్ లాంటి విష వాయువులు గాల్లోకి విడుదలవుతున్న కొద్ది మానవాళికి ముప్పు తప్పదని చెబుతున్నారు. రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధకులు బృందంగా ఏర్పడి...వైరస్‌లను కనుగొంటున్నారు. వీటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. మంచు కరిగిపోతున్న కొద్ది ఇలాంటి వైరస్‌లు ఎన్నో బయట పడతాయని అంటున్నారు. 


కెనడాలోనూ..


ఇటీవల కెనడాలో ప్రాణాంతక జాంబీ వైరస్‌ బయపడింది. కెనడాలోని జింకల్లో ఈ జాంబి వైరస్‌ కనిపించింది. జాంబీ సినిమాల్లో చూపించినట్లే ఇక్కడ జరుగుతోంది.  జాంబీ సోకిన మనిషి కరిచిన వాళ్లు కూడా జాంబీగా మారతారు. అలాగే ఇప్పుడు కెనడాలో జాంబీ సోకిన జింకలు..ఇతర జింకలను చంపి తింటున్నాయి. జింకల్లో ఈ వైరస్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. 1996లోనే పశువుల్లో ఈ జాంబీ వైరస్‌ను గుర్తించారు. వాటి శాంపిల్స్‌ సేకరించి టెస్టులు చేయగా బ్యాక్టీరియా, ఇతర వైరస్‌ల జన్యు సమాచారం లభించింది. అప్పట్లో ఆ వ్యాధికి అడ్డుకట్ట వేశారు. మళ్లీ దాదాపు 25 ఏళ్ల తర్వాత జింకల్లో జాంబీ వైరస్‌ బయటపడటం టెన్షన్‌ పెడుతోంది. ఈ వైరస్‌ జింకల నుంచి ఇతర జంతువులు, మనుషులకు 
కూడా వ్యాపించే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకిన జంతువు మాంసం తిన్నా, దాని మలమూత్రాలు, లాలాజలం ముట్టుకున్నా కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. వేటగాళ్లు జాగ్రత్తగా లేకపోతే పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం ఉందంటున్నారు.


Also Read: Indian Army's Kite: గద్దలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ, శత్రు డ్రోన్‌లు పసిగట్టేందుకు కొత్త ప్లాన్