20 th July 2024 News Headlines in Telugu For School Assembly:
1. ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఎడతెరపిలేని వానలు కురవడంతో వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ధవళేశ్వరం, శ్రీశైలం సహా జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో ఇవాళ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గోదావరి ప్రవాహం పెరగడంతో విలీన గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
2. ఆంధ్రప్రదేశ్ కృత్రిమ మేధ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విశాఖ, అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజల వ్యక్తిగత జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజయన్ ఉండాలని ఆయన అన్నారు.
3. అంగన్‌వాడీ కేంద్రాలను ప్లే స్కూళ్ల తరహాలో తీర్చిదిద్ది అక్కడే మూడో తరగతి వరకు విద్యాబోధన చేస్తామని తెంలగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ స్కూళ్లలో ప్రతి కేంద్రానికి ఒక టీచర్‌ను నియమిస్తామన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామన్న ఆయన... 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. త్వరలో విద్య, వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
4. తెలంగాణలో గ్రూప్-2 రాత పరీక్షలు వాయిదపడ్డాయి. ఆగస్టు 7, 8 జరగాల్సిన పరీక్షలను ల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీ షెడ్యూలు చేసింది. గ్రూప్ 2 పరీక్షలను డిసెంబరులో నిర్వహిస్తామని, తేదీలను త్వరలో ప్రకటిస్తామని TGPSC వెల్లడించింది. తర్వాత ప్రకటిస్తామంది. సీఎం సూచనతో నిరుద్యోగుల కోరిక మేరకు గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేశారు.
5. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్లకు నేర విచారణల నుంచి సంపూర్ణ రక్షణ కల్పించే ఆర్టికల్ 361ని పరిశీలించేందుకు అంగీకారం తెలిపింది. బెంగాల్ గవర్నర్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారన్న ఓ మహిళా ఉద్యోగి ఆరోపణల వివాదం నేపథ్యంలో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్ర, జస్టిస్ జె.బి.పార్దీవాలాతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
6. 78వ స్వాతంత్ర దినోత్సవ ధీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2047 నాటికి భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. అప్పటికల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఈసారి స్వాతంత్ర్య వేడుకులను వికసిత్ భారత్ థీమ్‌తో నిర్వహిస్తారు.
7. పాకిస్థాన్‌లో హిందూ జనాభ పెరిగింది. 2017లో దాయాది దేశంలో 35 లక్షల మంది హిందూ జనాభా ఉండగా 2023 నాటికి అది 38 లక్షలకు పెరిగిందని జన గణన తేల్చింది. పాకిస్థాన్‌లో అత్యధిక జన సంఖ్య గల మైనారిటీ వర్గం హిందువులేనని కూడా వెల్లడైంది. 2050 నాటికి పాక్‌లో హిందూ జనాభ రెట్టింపు కానుంది.
8. మహిళల ఆసియాకప్‌లో భారత్ శుభారంభం చేసింది. దాయాది పాకిస్తాన్‌ను మట్టి కరిపించి తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ కేవలం 108 పరుగులకే కుప్పకూలగా.. భారత జట్టు 14 ఓవర్లలోనే మూడే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
9. కరెంట్ అఫైర్
గర్బా నృత్య రూపం భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినది?
సమాధానం : గుజరాత్
10. మంచిమాట
బద్ద శత్రువు కన్నా అసూయతో రగిలిపోయే మిత్రుడే ప్రమాదకరం