భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు ప్రతులు ఇక నుంచి ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకు సంబంధించిన సేవలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం (జనవరి 25) ప్రారంభించారు. ఎలక్ట్రానిక్-సుప్రీం కోర్టు (e-SCR) ప్రాజెక్టులో భాగంగా గణతంత్ర దినోత్సవం నుంచి ఇవి ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంటాయనే విషయాన్ని సుప్రీం కోర్టు న్యాయవాదులకు సీజేఐ వెల్లడించారు.


ప్రాంతీయ భాషల్లో 1091 తీర్పు ప్రతులు.. 
తేలికగా శోధించేందుకు వీలున్న ఎలక్ట్రానిక్-సుప్రీం కోర్టు ప్రాజెక్టులో ఇప్పటివరకు 34 వేల తీర్పు కాపీలున్నాయి. 1091 తీర్పు ప్రతులు ప్రాంతీయ భాషల్లో ఉన్నాయి. ఇవి జనవరి 26 నుంచి అందుబాటులోకి వస్తాయి అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. వీటితోసహా అధికారిక భాషలన్నింటిలో వీటిని అందుబాటులో ఉంచేందుకు కృషి జరుగుతోందన్నారు. ప్రస్తుతానికి జనవరి 1, 2023 వరకు ఇచ్చిన తీర్పుల ప్రతులు అందుబాటులోకి వస్తాయన్న సీజేఐ.. మరికొన్ని వారాల్లో సెర్చ్ ఇంజిన్‌ను మరింత మెరుగుపరుస్తామన్నారు.


వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో అందుబాటులో..
ఈ-ఎస్‌సీఆర్ ప్రాజెక్టులో భాగంగా 34వేల తీర్పు ప్రతులను న్యాయవాదులు, విద్యార్థులు, సామాన్య పౌరులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తామని జనవరి 2న భారత అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. ఇందులో భాగంగా వీటిని సుప్రీం కోర్టు వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తోపాటు నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జేడీజీ) జడ్జిమెంట్ పోర్టల్స్‌లోనూ పొందుపరుస్తామని తెలిపింది. రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో 22 గుర్తింపు పొందిన భాషలున్నాయి. ఇదిలాఉంటే, కోర్టు తీర్పు ప్రతులను ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇటీవలే ప్రశంసించిన విషయం తెలిసిందే.


Also Read:


పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం - మహలనబీస్‌కు పద్మవిభూషణ్
కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికిగానూ పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రస్తుతం మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా.. అందులో ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మంది ప్రముఖులకు పద్మ భూషన్, మరో 91 మంది ప్రముఖులను పద్మశ్రీ అవార్డులు వరించాయి. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కు, ఓఆర్ఎస్ సృష్టికర్త డాక్టర్ దిలీప్ మహాలనబీస్ కు, బాలక్రిష్ణ దోషికి మరణాంతరం దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించారు. జాకీర్ హుస్సేన్ (ఆర్ట్), ఎస్ఎం క్రిష్ణ (ప్రజా వ్యవహారాలు), శ్రీనివాస్ వర్ధన్ (యూఎస్ఏ)కు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పద్మవిభూషణ్ పురస్కారం దక్కించుకున్నారు. మెడిసిన్ పీడియాట్రిక్స్ విభాగంలో దిలీప్ మహాలనబీస్ కు మరణానంతరం ఈ అత్యున్నత పురస్కారం లభించింది. కలరా, డయేరియా, డీ హైడ్రేషన్ తోనే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో ORS ను కనిపెట్టి మహలనోబిస్ 93శాతం మరణాలను తగ్గించారు. పలు రంగాల్లో సేవ చేసిన 25 మంది ప్రముఖులను పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం.
తెలుగు రాష్ట్రాల్లో 'పద్మ' అవార్డులకు ఎంపికైనవారి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం, వచ్చే ఏడాది నుంచి కొత్త 'గ్రూపు' అందుబాటులోకి!
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్తగా మరో గ్రూపు అందుబాటులోకి రానుంది. అకౌంట్స్ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ ఈ గ్రూపును వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అకౌంటెన్సీతో పాటు కామర్స్, ఆర్థికశాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉండనున్నాయి. సీఈఏ గ్రూపుగా పిలవనున్నారు. ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలుగా సీఈఏ గ్రూపును రూపొందించారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...