తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్తగా మరో గ్రూపు అందుబాటులోకి రానుంది. అకౌంట్స్ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ ఈ గ్రూపును వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అకౌంటెన్సీతో పాటు కామర్స్, ఆర్థికశాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉండనున్నాయి. సీఈఏ గ్రూపుగా పిలవనున్నారు. ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వీలుగా సీఈఏ గ్రూపును రూపొందించారు. 


వచ్చే విద్యా సంవత్సరం(2023-24) నుంచి అందుబాటులోకి తేనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్‌ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు ఉన్నాయి. చివరిసారిగా.. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం గణితం, ఆర్థికశాస్త్రం, కామర్స్ సబ్జెక్టుల సమ్మేళనంతో ఎంఈసీ గ్రూపు అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత వేరే కొత్త గ్రూపులేవీ రాలేదు. ఉన్న కోర్సుల్లోని సబ్జెక్టుల సిలబస్‌ను మాత్రం కాలానుగుణంగా మారుస్తూ వచ్చారు. ఇప్పుడు కొత్తగా సీఈఏ గ్రూపును ప్రవేశపెడుతున్నారు. అయితే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల్లో 11, 12 తరగతుల్లో అకౌంటెన్సీ సబ్జెక్టు ఎన్నో ఏళ్లుగా అమల్లో ఉంది.


వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లోని కామర్స్ సబ్జెక్టు పేరును కామర్స్ అండ్ అకౌంటెన్సీగా మార్చుతున్నారు. ఇక కొత్త గ్రూపు సీఈఏలో ఒక సబ్జెక్టుగా అకౌంటెన్సీ ఉన్నందున అందులో కామర్స్ పేరు యథాతథంగా ఉంటుందని ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి.


Also Read:


ఇంటర్ 'అఫిలియేషన్‌'కు 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ! ఏప్రిల్‌ 30 నాటికి కళాశాలల జాబితా!
తెలంగాణలోని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌(గుర్తింపు)కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇంటర్‌ బోర్డు సోమవారం (జనవరి 23) విడుదల చేసింది. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ కళాశాలల గుర్తింపుకు ఆయా కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ ఈమేరకు ఉత్తర్వుల్లో తెలిపారు. జనవరి 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. మండల పరిధిలోని కాలేజీల షిఫ్టింగ్‌కు కూడా అవకాశం కల్పించారు. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తుల అప్‌లోడింగ్‌కు ఫిబ్రవరి 21 వరకు గడువిచ్చారు. రూ.20వేల అపరాధ రుసుముతో మార్చి 31 వరకు అవకాశం కల్పించారు. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను ఏప్రిల్‌ 30వ తేదీన వెల్లడిస్తామని పేర్కొన్నారు. సంబంధిత ధ్రువపత్రాలను పొందుపరిచి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఆ అభ్యర్థులకు జనవరి 28 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు, వెబ్ సైట్ లో అడ్మిట్ కార్డులు!
వివిధ కారణాల చేత జేఈఈ మెయిన్ 2023 సెషన్-1 పరీక్ష అడ్మిట్‌కార్డులను పొందలేకపోయిన అభ్యర్థుల హాల్‌టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. జేఈఈ దరఖాస్తు సమయంలో కొంతమంది అభ్యర్థులు తప్పుడు వివరాలు నమోదుచేయండి, ఫొటోలు సరిగా లేకపోవడం వంటివి చేశారు. వీరికి సంబంధించిన హాల్‌టికెట్లను ఎన్టీఏ పెండింగ్‌లో ఉంచింది. తాజాగా వీరి అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ మేరకు ట్వట్టర్ ద్వారా ప్రకటించింది. వీరికి జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు షెడ్యూలువారీగా జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


విద్యార్థులకు గుడ్ న్యూస్, డ్యూయల్ డిగ్రీ విధివిధానాలు జారీ!
ఇంజినీరింగ్ కళాశాలల్లో డ్యూయల్ డిగ్రీ కోర్సులకు జేఎన్‌టీయూ(JNTU) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విధివిధానాలను యూనివర్సిటీ జారీ చేసింది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. దీనిప్రకారం ఒక్కో కాలేజీకి 60 సీట్లు కేటాయించింది. అయితే కనీసం 30 శాతం మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని ఉంటేనే కళాశాలకు అనుమతి లభిస్తుంది. ఇంజినీరింగ్ 2,3,4 ఏడాది చదువుతున్న విద్యార్థులు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...