వివిధ కారణాల చేత జేఈఈ మెయిన్ 2023 సెషన్-1 పరీక్ష అడ్మిట్‌కార్డులను పొందలేకపోయిన అభ్యర్థుల హాల్‌టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. జేఈఈ దరఖాస్తు సమయంలో కొంతమంది అభ్యర్థులు తప్పుడు వివరాలు నమోదుచేయండి, ఫొటోలు సరిగా లేకపోవడం వంటివి చేశారు. వీరికి సంబంధించిన హాల్‌టికెట్లను ఎన్టీఏ పెండింగ్‌లో ఉంచింది. తాజాగా వీరి అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ మేరకు ట్వట్టర్ ద్వారా ప్రకటించింది. వీరికి జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు షెడ్యూలువారీగా జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. 


JEE Main 2023 hall ticket: Direct link to download






ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 24, 25, 29, 30, 31 తేదీలతో పాటు ఫిబ్రవరి 1న బీటెక్‌లో ప్రవేశానికి పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ర్యాంకుతో ఎన్‌ఐటీల్లో చేరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 పరీక్ష జనవరి 28న రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ఇప్పటికే జేఈఈ మెయిన్ పరీక్ష హాల్‌టికెట్లను ఎన్టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 24న పరీక్ష రాసేవారు హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


దేశవ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పరీక్ష రాసేవారి సంఖ్య లక్షన్నర వరకు ఉంటుంది. తెలుగు సహా 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ చూపినవారిలో 2.50 లక్షల మంది మాత్రమే జూన్ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హులవుతారు. 


విద్యార్థులకు ముఖ్య సూచనలు....


➥పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలి. అడ్మిట్ కార్డులో పేర్కొన్న సమయానికి మీకు కేటాయించిన పరీక్ష కేంద్రం వద్ద రిపోర్టు చేయాలి. 


➥ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా హాల్‌టికెట్‌ను వెంట తీసుకొని వెళ్లాలి. ఎన్‌టీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్‌కార్డు లేకపోతే పరీక్ష హాలులోకి అనుమతించరు.


➥ పరీక్ష రాసే విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంటతీసుకెళ్లాలి. పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డు, అభ్యర్థి ఫొటో ఉన్న బ్యాంకు పాసు పుస్తకం.. వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు చేసినప్పుడు అప్‌లోడ్ చేసిన ఫొటోను ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే దాన్ని అటెండెన్స్ షీట్‌పై అతికించాల్సి ఉంటుంది.


➥ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి బ్లూ/బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌ మాత్రమే తీసుకెళ్లాలి.


➥ దివ్యాంగులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు తమ వెంట మెడికల్ ఆఫీసర్ ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.


➥ పరీక్ష కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్/ఇయర్ ఫోన్/మైక్రోఫోన్/ పేజర్, కాలిక్యులేటర్, డాక్యుపెన్, కెమెరా, టేప్ రికార్డర్ వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు/గ్యాడ్జెట్లు/పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.


➥ చాక్లెట్లు/క్యాండీ/శాండ్‌విచ్ వంటి ప్యాక్ చేసిన ఆహారపదార్థాలు, చిరుతిళ్ళు, జామెట్రీ/పెన్సిల్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్, పర్సు, పేపర్లు/స్టేషనరీ, ప్రింటెడ్ మెటీరియల్, వాటర్ బాటిళ్లను కూడా అనుమతించరు. 


➥ డయాబెటిక్ విద్యార్థులు షుగర్ టాబ్లెట్స్/పండ్లు వంటివి తీసుకెళ్లడానికి వెసులుబాటు ఉంది. ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్‌ను తీసుకెళ్లొచ్చు.  


➥ పరీక్ష కేంద్రంలో ఏమైనా టెక్నికల్ సమస్యలు, ఇతర ఏదైనా ఇబ్బందులు ఎదురైతే పరీక్ష సెంటర్ సూపరింటెండెంట్ లేదా ఇన్విజిలేటర్‌ను సంప్రదించవచ్చు.


➥ పరీక్ష కేంద్రంలో ఇచ్చే రఫ్ షీట్లపైనే కాలిక్యులేషన్సు/రైటింగ్ వర్కు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రఫ్ షీట్లను కచ్చితంగా ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.


పరీక్ష విధానం:


➥ జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సులో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. 


➥ ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సు్ల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.


➥ బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.