SC on BBC Documentary: 


గుజరాత్ అల్లర్లపై బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. మూడు వారాల్లో కేంద్రం సమాధానం ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఏప్రిల్‌కు విచారణను వాయిదా వేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎమ్ఎమ్ సుంద్రేశ్‌తో కూడా ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. అడ్వకేట్ ఎమ్‌ ఎల్ శర్మతో పాటు సీనియరన్ జర్నలిస్ట్ ఎన్‌ రామ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, అడ్వకేట్ ప్రశాంత భూషణ్...సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. 2002లో జరిగిన గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన ఎన్నో నిజాలున్నాయని, వాటిని వెలుగులోకి తీసుకొస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఎక్కడా ఈ వీడియోలు లేకుండా చేయడాన్నీ సవాలు చేశారు.