Sanjay Raut on Uddhav:


ఆసక్తికర వ్యాఖ్యలు..


ఉద్దవ్ ఠాక్రే శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గురించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. "రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కింగ్ ఛార్ల్స్‌..వీళ్లంతా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గురించి మాట్లాడుకుంటారు. ఆయన గురించి మాట్లాడుకునేందుకు ఓ వీడియో
కాన్ఫరెన్స్ కూడా పెట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ ఉద్ధవ్ ఠాక్రేను పరిచయం చేయలేదు ఎందుకని ఆ ముగ్గురు నేతలూ ఫీల్ అయ్యారు" అని అన్నారు సంజయ్ రౌత్. అంతే కాదు. ఆ స్పీచ్‌లో మరి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఆ ముగ్గురు నేతలూ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వం ఠాక్రే ఎలా పోరాటం చేస్తున్నారోనని చర్చించుకున్నారు. వాళ్లే కాదు. ఉక్రెయిన్
అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఠాక్రే గురించి ఆరా తీశారు. నాగ్‌పూర్‌లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు సంజయ్ రౌత్. దీనిపై బీజేపీ ట్విటర్ వేదికగా సెటైర్లు వేస్తోంది. కమెడియన్ కపిల్ శర్మతో పోల్చుతూ విమర్శిస్తోంది. బీజేపీ నేత ప్రీతి గాంధీ ట్విటర్‌లో సంజయ్ స్పీచ్ షేర్ చేస్తూ సెటైర్లు వేశారు. "పుతిన్, బైడెన్, కింగ్ ఛార్ల్స్ ఉద్దవ్ ఠాక్రే ఎవరు అని ఆరా తీసేందుకు వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నారట. ఠాక్రే ఎవరో తెలుసా? ప్రధాని నరేంద్ర మోడీ చేతుల్లో ఓటమి పాలై కూడా ఆ ఓటమిని ఒప్పుకోని వ్యక్తే ఠాక్రే. కపిల్ శర్మ షోకి కాంపిటీషన్ పెరిగిపోతోంది" అని ట్వీట్ చేశారు. అయితే...సంజయ్ రౌత్ ఇలా మాట్లాడారేంటి..? అని అంతా అనుకున్నారు. కానీ...ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేకు సెటైర్ వేశారని తరవాత అర్థమైంది. 






శిందేకు కౌంటర్..? 


ఇటీవలే ఏక్‌నాథ్ శిందే కీలక వ్యాఖ్యలు చేశారు. "అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ నా గురించి ఆరా తీశారు. క్లింటన్‌తో చాన్నాళ్ల పాటు ఉన్న ఓ ఇండియన్ నాకీ విషయం చెప్పాడు. కొన్ని నెలల క్రితం కలుసుకున్నప్పుడు ఈ విషయం వివరించాడు" అని అన్నారు. దీనికి సెటైర్‌గా సంజయ్ రౌత్ ఆ కామెంట్స్ చేశారు. 


Also Read: Nation’s Biggest Foodie: ఏడాదిలో ఏకంగా 3,330 ఆర్డర్లు- జొమాటో టాప్‌ కస్టమర్‌ అతనే!