Sanjay Malhotra has been appointed as the new Governor of RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రాను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వాలు జారీ చేసింది. మల్హోత్రా రాజస్తాన్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిగా పని చేశారు. 1990 లో ఐఏఎస్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం పదవి పదవి విరమణ చేయనున్నారు. పదకొండో తేదీ నుంచి మల్హోత్రా పదవి కాలం అమల్లోకి వస్తుంది. మూడేళ్ల పాటు ఆయన పదవి కాలం ఉటుందని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 






కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సంజయ్ మల్హోత్రా                      


సంజయ్ మలోత్రా మూడేళ్ల పాటు ఆర్‌బీఐ గవర్నర్‌గా పదవిలో కొనసాగనున్నారు. ఈయన.. పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గనులు మొదలైన అనేక రంగాలలో పనిచేశారు. భారత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శి పదవిని నిర్వహించారు.  ప్రస్తుతం మల్హోత్రా ఆర్థిక మంత్రిత్వ శాఖలో  రెవిన్యూ కార్యదర్శిగా పదవిలోఉన్నారు. 


గత ఆరేళ్లుగా ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న శక్తికాంత దాస్                             


ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ 2018లో పదవిలోకి వచ్చారు. అప్పట్నుంచి ఆయనే కొనసాగుతున్నారు. రెండు దఫాలుగా ప్రదాని మోదీ ఆయనకు చాన్సిచ్చారు. సవాళ్లు ఎదుర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థను ఆయన గాడిలో పెట్టారు. కరోనా సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో ఆర్బీఐ గవర్నర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకుని ఎవరికీ ఇబ్బంది లేకుండా దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగేలా నిర్ణయాలు తీసుకున్నారు.                    


వడ్డీ రేట్ల తగ్గింపు కోసం చూస్తున్న మార్గెట్ వర్గాలు                               


శక్తికాంత దాస్ కూడా ఐఏఎస్ అధికారి. ఆయన తమిళనాడు క్యాడర్ కు చెందిన వారు. అయితే ఎక్కువ కేంద్ర సర్వీసుల్లోనే పని చేశారు. ఫెర్టిలైజర్స్ సెక్రటరీగా.. రెవిన్యూ సెక్రటరీగా , ఎకనమిక్ ఎఫైర్స్ సెక్రటరీగా , ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గా కూడా పని చేశారు. ఇప్పుడు సంజయ్ మల్హోత్రా కూడా అలాంటి ఆర్థిక పరమైన కీలక బాధ్యతల నేపధ్యంగానే ఆర్బీఐ గవర్నర్ గా వస్తున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా గతంలో వరుసగా వడ్డీ రేట్లు పెంచారు శక్తికాంత దాస్. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడినందున తగ్గిస్తారేమోనని మార్కెట్ వర్గాలు చూస్తున్నాయి. ఈ సమయంలో కొత్త గవర్నర్ తీసుకునే నిర్ణయాలపై మార్కెట్ ఆసక్తిగా చూడనుంది.