Sania Mirza And Mohammad Shami Spotted Together In Dubai Photo Goes Viral: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా , క్రికెటర్ మహమ్మద్ షమీ మధ్య ఏదో ఉందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఎవరూ స్పందించలేదు. హఠాత్తుగా వారిద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటో వైరల్ గా మారింది. వీరిద్దరూ దుబాయ్ లో కలుసుకున్నారని .. ఆ ఫోటోనే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
సానియా మీర్జా ప్రస్తుతం కుమారుడితో కలిసి దుబాయ్ లోనే నివసిస్తున్నారు. ఆమె పాకిస్తాన్ క్రికెటర్ షోయుబ్ మాలిక్ ను వివాహం చేసుకున్నారు. అయితే ఓ బిడ్డ పుట్టిన తర్వాత కొన్నాళ్ల కిందట విడాకులు తీసుకున్నారు. షోయుబ్ మాలిక్ మూడో పెళ్లిని ఓ పాకిస్తాన్ నటి, మోడల్ ను చేసుకున్న తర్వాతనే విషయం బయటకు వచ్చింది. తాము విడిపోయామని సానియా మీర్జా ప్రకటించింది. కుమారుడితో కలిసి ఎక్కువగా దుబాయ్ లోనే ఉంటున్నారు.
క్రికెటర్ మహమ్మద్ షమీ కూడా తన వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొన్నారు. మోడల్ అయిన తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. ఈ వ్యవహారం చాలా వివాదాస్పదం అయింది. ఇప్పటికీ షమీపై మొదటి భార్య విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు.
షమీ, సానియా మీర్జా గతంలో బయట కలిసినట్లుగా పెద్దగా ఫోటోలు బయటకు రాలేదు. కానీ ఆ మధ్య టర్కీలో పెళ్లి చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. నిజంగా పెళ్లి చేసుకున్నారా లేదా అన్నది అధికారిక ప్రకటన చేయలేదు. కనీసం ఖండించలేదు. దాంతో అవి రూమర్స్ గానే ఉండిపోయాయి. ఇప్పుడు వారిద్దరూ దుబాయ్ లో జంటగా కనిపించడంతో మరోసారి ఆ రూమర్స్ నిజమేనా అన్న చర్చ ప్రారంభమయింది.
Also Read:బాలీవుడ్ నటి సన్నీలియోనికి నెలకు రూ.1000 - ప్రభుత్వ పథకం కింద అకౌంట్లోకి డబ్బులు, అధికారులు షాక్
షమీ ఇప్పటికీ కెరీర్ లో కీలకంగా ఉన్నారు. అయితే సానియా మీర్జా మాత్రం టెన్నిస్ నుంచి రిటైరయ్యారు. ఇద్దరూ సెలబ్రిటీలే కావడంతో వీరి మధ్య ఎఫైర్ ఉందా లేదా అన్నచర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ఇలాంటి రూమర్స్ కు స్పందిస్తే ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుందన్న ఉద్దశంతో సానియా మీర్జా, ఆమె కుటుంబం ఇలాంటి వ్యక్తిగత విషయాలపై స్పందించడం మానేసింది. సానియా మీర్జా సోషల్ మీడియాలో అకౌంట్లలో ఎప్పుడూ షమీతో కలసి ఉన్న ఫోటోలు పెట్టలేదు. తాజాగా మరో పెళ్లి గురించి కానీ.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ ఎలాంటి పోస్టులు పెట్టలేదు. ఇప్పుడు షమీతో కలిసి దిగిన ఫోటోల వెనుక సందర్భం ఏమిటో ప్రకటిస్తే కానీ క్లారిటీ రాదు. షమీ ప్రకటించినా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.