Sadhvi Prem Baisa Obscene Video : సాధ్వీ ప్రేమ్ బైసా అనే రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, భగవత్ కథా వక్త వివాదాస్పద వీడియోతో వివాదంలో చిక్కుకున్నారు. ఈ వీడియోలో మరో అథ్యాత్మిక వేత్త వీరంపురి మహారాజ్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉన్నారు. వైరల్అయిన వీడియోలో సాధ్వీ ప్రేమ్ బైసా ఒక వ్యక్తిని ఆలింగనం చేసుకుంటున్నట్లు చూపిస్తోంది. మరో వెర్షన్‌లో ఆమె మంచం మీద ఉండగా, సన్యాసి దుస్తుల్లో ఉన్న వ్యక్తి ఆమెను ఆలింగనం చేసుకున్న దృశ్యాలు ఉన్నాయి.
ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె స్పందించారు. సాధ్వీ ప్రేమ్ బైసా ఈ వీడియో పాతదని, మార్ఫింగ్ చేసి, ఎడిట్ చేసి తనను అపఖ్యాతి పాలు చేసేందుకు ఉపయోగించారని ఆరోపించారు. వీడియోలోని వ్యక్తి తన తండ్రి వీరంపురి మహారాజ్ (వీరమ్‌నాథ్) అని.. ఇది నాలుగేళ్ల క్రితం ఇతరుల సమక్షంలో రికార్డు చేశారని వివరణ ఇచ్చారు. ఇందులో అభ్యంతరకరం ఏమీలేదన్నారు.
ఈ వీడియోను బహిరంగం చేయకుండా ఉండేందుకు 20 లక్షలు డిమాండ్ చేసి తనను బ్లాక్‌మెయిల్ చేశారని ప్రేమ్ బైసా ఆరోపించారు. ఆమె డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో, నిందితులు ఎడిట్ చేసిన వీడియోను ఆన్‌లైన్‌లో విడుదల చేశారని చెప్పారు. మూడేళ్ల క్రితం ఇదే వీడియోతో బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించిన ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు.
సాధ్వీ ప్రేమ్ బైసా జోధ్‌పూర్‌లోని బోరనాడ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు వ్యక్తులపై, ఒక జంటతో సహా, బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. జోధ్‌పూర్ పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ప్రవచనాలు చెబుతూ బాగా పేరు తెచ్చుకుంటున్న ప్రేమ్ బైసా మీద కుట్ర చేశారని ఆమె అనుచరులు అంటున్నారు.