శ్రీరామ్ వెంకట్, వర్షిణి జంటగా నటిస్తున్న తెలుగు సీరియల్ 'జయం'. ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ 'జీ తెలుగు'లో జూలై 14 నుంచి ప్రసారం అవుతోంది. మొదటి వారం ఈ సీరియల్ ఎంత టీఆర్పీ నమోదు చేసింది? 'జీ తెలుగు'లో మిగతా సీరియళ్లతో కంపేర్ చేస్తే ఏ స్థానంలో ఉంది? అనేది ఒక్కసారి తెలుసుకోండి. 

పట్టణాల్లోకాస్త ఎక్కువ... ఆల్ ఓవర్ చూస్తే డీసెంట్!Jayam Serial TRP Rating Launch Week: 'జయం' సీరియల్ మొదటి వారం అర్బన్ ఏరియాల్లో 6.92 టీఆర్పీ సాధించింది. కొత్త సీరియల్, అందులోనూ 'ప్రేమ ఎంత మధురం' వంటి సూపర్ డూపర్ హిట్ సీరియల్ తర్వాత శ్రీరామ్ వెంకట్ చేసిన సీరియల్‌కు ఆ మాత్రం అంటే డీసెంట్ అని చెప్పాలి. ఆహా ఓహో సూపర్ అని చెప్పలేం. అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలు చూస్తే... 6.42 టీఆర్పీ సాధించింది 'జయం' సీరియల్. 

జీ తెలుగు సీరియళ్లలో టీఆర్పీ పరంగా దీనిది ఏ స్థానంలో?Zee Telugu Serials TRP Ratings This Week: ఈ వారం జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ చూస్తే... 'జయం' నాలుగో స్థానంలో ఉంది.

Also Read: జీ తెలుగులో శ్రీరామ్ వెంకట్ కొత్త సీరియల్... 'జయం' కథ నుంచి యాక్టర్స్ వరకు ఈ డీటెయిల్స్ తెలుసా?

జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ లిస్టులో 'చామంతి' ఈ వారం మొదటి స్థానంలో నిలిచింది. అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాల్లో ఆ సీరియల్ 7.25 టీఆర్పీ సాధించి మిగతా వాటిని వెనక్కి నెట్టింది. ఆ తర్వాత స్థానంలో 'జగద్ధాత్రి' ఉంది. ఆ సీరియల్ 7.11 టీఆర్పీ సాధించింది. ఇక 7.06 టీఆర్పీతో 'మేఘ సందేశం' మూడో స్థానంలో ఉంది. వాటి తర్వాత 6.42 టీఆర్పీతో నాలుగో స్థానంలో 'జయం' నిలిచింది. ఫస్ట్ వీక్ ఇది డీసెంట్ టీఆర్పీ కనుక సెకండ్ వీక్, తర్వాత వీక్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ వారం 'జీ తెలుగు'లో టాప్ 5 టీఆర్పీ రేటింగ్ సీరియల్ విషయానికి వస్తే... 5.77తో 'లక్ష్మీ నివాసం' నిలిచింది. 

'జీ తెలుగు'లో సోమవారం నుంచి శనివారం వరకు 'జయం' సీరియల్ ప్రతి రోజూ రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారం అవుతోంది.

Also Read: డిజిటల్ డిటాక్స్... సోషల్ మీడియాకు 'జబర్దస్త్' యాంకర్ రష్మీ గౌతమ్ బ్రేక్