Sabarimala Online Booking: శబరిమల దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ ఓపెన్.. టికెట్లు ఇలా బుక్ చేయండి!

శబరిమల ఆలయ దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ మొదలైంది. టికెట్లు ఎలా బుక్ చేయాలో ఇక్కడ చూడండి.

Continues below advertisement

కేరళలోని శబరిమల అయ్యప్ప దేవస్థానం దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమైంది. మండల మకరవిళక్కు పండగ సీజన్​ సందర్భంగా నవంబరు 16 నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నారు. రోజుకు 25 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇప్పటికే స్పష్టం చేశారు. పరిస్థితులను గమనించి భక్తుల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Continues below advertisement

కొవిడ్​ నేపథ్యంలో గతేడాది ఏర్పాటు చేసిన వర్చువల్​ క్యూ సిస్టమ్​ను ఈ సంవత్సరం కూడా పాటిస్తున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దర్శనం బుక్ చేసుకోవాలి. ఎలా చేయాలంటే..

  • శబరిమల అధికారిక వెబ్‌సైట్ https://www.sabarimalaonline.org. ఓపెన్ చేయాలి.
  • లాగిన్ లేదా రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను ఎన్నుకోవాలి.
  • లాగిన్ లేదా సైన్ అప్ అనే ఆప్షన్‌లో ఒకటి సెలక్ట్ చేయాలి. 
  • ఇంతకుముందే ఎన్‌రోల్ అయి ఉంటే మెంబర్ లాగిన్‌ను క్లిక్ చేయాలి. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. 
  • కొత్త సభ్యులకు రిజిస్ట్రేషన్ చేయాలంటే సైన్ అప్ ఆప్షన్‌ను ఎన్నుకొని అవసరమైన వివరాలను ఇవ్వాలి.
  • ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, ఐడీ ప్రూఫ్, ఐడీ నంబర్ ఇవ్వాలి. 
  • అనంతరం యూజర్ నేమ్, అడ్రస్ ఇచ్చి పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. 
  • ఇది పూర్తయిన తర్వాత కొత్త పాస్‌వర్డ్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. శబరిమల ఆన్‌లైన్ సేవల కోసం కొత్త పాస్‌వర్డ్, యూజర్ నేమ్.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్‌కు వస్తుంది. 
  • అనంతరం కొత్త లాగిన్ వివరాలతో శబరిమల ఆన్‌లైన్ దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 

ఇవి కావాలి..

ఈసారి 10 ఏళ్లలోపు, 65 ఏళ్లు పైబడిన వారిని కూడా దర్శనానికి అనుమతించనున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. టీకా పొందినట్లు ధ్రువపత్రం చూపించినవారితో పాటు, కరోనా ఆర్​టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే దేవస్థానంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తున్నారు.

నెయ్యాభిషేకం కార్యక్రమానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఆలయ బోర్డు నిశ్చయించింది. ఆ రోజు దర్శనం అనంతరం భక్తులు సన్నిధానంలో ఉండేందుకు అనుమతిని నిరాకరించింది.

Also Read: ఐకాల్ ఎన్18 కాలింగ్ ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: ఫ్యూజన్5 4జీ ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola