ఉక్రెయిన్‌లో ఇండియన్స్‌కు భారత్ వార్నింగ్- వీలైనంత త్వరగా!

ABP Desam Updated at: 20 Oct 2022 05:41 PM (IST)
Edited By: Murali Krishna

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో ఉన్న భారత పౌరులు వీలైనంత త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని భారత ఎంబసీ ప్రకటించింది.

ఉక్రెయిన్‌లో ఇండియన్స్‌కు భారత్ వార్నింగ్- వీలైనంత త్వరగా!

NEXT PREV

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత ఉద్ధృతం చేయడంతో మరోసారి వాతావరణం వేడెక్కింది. దీంతో ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు అక్కడి ఇండియన్ ఎంబసీ హెచ్చరిక జారీ చేసింది. వీలైనంత త్వరగా ఉక్రెయిన్‌ను విడిచిపెట్టి పోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. 



ఉక్రెయిన్ అంతటా భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇక్కడ దాడులు పెరిగిన దృష్ట్యా భారత పౌరులు ఉక్రెయిన్‌కు వెళ్లవద్దని సూచన. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులతో సహా భారతీయ పౌరులు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా వీలైనంత త్వరగా ఉక్రెయిన్‌ను విడిచిపెట్టాలని సూచన అని సలహా తెలిపింది. -               కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం 


తీవ్రంగా


ఉక్రెయిన్‌పై రష్యా ఉక్రోశం రోజురోజుకీ పెరుగుతోంది. క్రెచ్ ఘటన జరిగిన తరవాత పుతిన్ దూకుడు మరింత పెంచారు. ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాలపై రష్యా సైన్యం మిసైల్స్‌తో దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే రాజధాని కీవ్‌పైనా డ్రోన్‌లతో దాడులు చేసింది. ఉక్రెయిన్ ప్రెసిడెన్సీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. "కమికేజ్ డ్రోన్స్ (Kamikaze drones)" దాడి చేసినట్టు  తెలిపింది. కీవ్‌లోని రెండు ప్రాంతాల్లో బాంబు దాడులు
జరిగాయి.



ఇలాంటి దాడులు చేయటం వల్ల తమకు ఏదో ఒరుగుతుందని రష్యా అనుకుంటోంది. కానీ...ఓడిపోతామేమోనన్న నిరాశలో ఇలాంటివి చేస్తున్నారని మాకు అర్థమవుతోంది. ప్రస్తుతం ఉన్న సైన్యం మాకు చాలటం లేదని, రక్షణను ఇంకా పెంచుకోవాల్సి ఉంది. ఆలస్యం చేసేంత సమయం లేదు. ఇప్పటికిప్పుడు మాకు ఆయుధాలు కావాలి. మా గగనతలాన్ని రక్షించుకుంటూ శత్రువుని మట్టుబెట్టాలి. -                                                       ఉక్రెయిన్


వరుస దాడులు


క్రిమియాలోని క్రెచ్ వంతెనపై బాంబు దాడి జరిగినప్పటి నుంచి ఉక్రెయిన్‌పై పుతిన్ ఇంకా ఆగ్రహంగా ఉన్నారు. ఇది కచ్చితంగా ఉక్రెయిన్ చేసిన పనేనని చాలా గుర్రుగా ఉన్నారు. అందుకే...ఆ దేశంపై మరింత కక్ష పెంచుకున్నారు. వెంటనే...ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపించారు. ఉక్రెయిన్‌లోని 40 ప్రాంతాలపై క్షిపణుల దాడులు చేసింది రష్యా. రాజధాని కీవ్‌లోనూ దాడి జరిగింది. డ్రోన్‌ల సాయంతో ఇలా విరుచుకుపడింది రష్యా సైన్యం. అయితే...ఈ దాడుల్లో ఎంత మంది చనిపోయారన్నది మాత్రం ఇంకా లెక్క తేలలేదు. కొన్ని ప్రాంతాల్లో అత్యంత కీలకమైన వసతులన్నింటినీ ధ్వంసం చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్‌ ఓ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ వాయుసేన..రష్యా డ్రోన్ దాడులను గట్టిగానే ఎదుర్కొంది. ఎదురు దాడికి దిగి రష్యాలోని 25 ప్రాంతాలపై 32 సార్లు దాడి చేసినట్టు వెల్లడించింది. 


Also Read: Congress On Shashi Tharoor: శశిథరూర్‌పై కాంగ్రెస్ ఫైర్- రిగ్గింగ్ ఆరోపణలకు కౌంటర్!

Published at: 20 Oct 2022 05:38 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.