బ్రహ్మంగారు చెప్పినట్లు ప్రపంచంలో ఏవేవో వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ప్రజల ఆరోగ్యంతోనే కాకుండా ఆర్థికంగానూ కుంగదీసింది. కరోనా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వింతలు, విశేషాలను కూడా మనం వింటున్నాం. వాటిలో ఇది కూడా ఒకటి. ఓ ఆవు.. రెండు తలల దూడకు జన్మనిచ్చింది. అయితే, ఈ రోజుల్లో జన్యు లోపం వల్ల ఇలాంటి జననాలు సహజమే. కానీ, ఆవుకు పుట్టిన ఆ దూడ పంది రూపంలో ఉండటమే ఆశ్చర్యపరుస్తోంది.
ఖాకాసియాలోని మట్కెచిక్ గ్రామంలో జన్మించిన ఆవును పశు వైద్యులు పరిశీలించారు. ఈ వింత దూడ పుట్టిన వెంటనే దాని తల్లి జన్మించింది. విషాదం ఏమిటంటే.. వింత దూడకు జన్మనిచ్చిన ఆవు వెంటనే ప్రాణాలు కోల్పోయింది. కొద్ది నిమిషాల తర్వాత దూడ కూడా చనిపోయింది. ఈ ఘటనపై రిపబ్లిక్ ఆఫ్ ఖాకాసియాకు చెందిన వ్యవసాయ, ఆహార మంత్రిత్వ శాఖ వెటర్నరీ మెడిసిన్ విభాగం ఈ వార్తను దృవీకరించింది.
ఆందోళన వద్దు: ‘‘జంతువుల్లో జన్యుపరమైన సమస్యలు ఏర్పడతాయి. జన్యువుల మ్యుటేషన్ ఇందుకు ప్రధాన కారణం. దీన్నే జన్యు మార్పు అని కూడా అంటారు. జంతువులలో బాహ్య, అంతర్గత ఉత్పరివర్తన వాతావరణం వల్ల ఇలాంటివి ఏర్పడతాయి. ఉత్పరివర్తనలు (మ్యూటాజెనిక్ - Mutagenic Influences) జన్యువులో వారసత్వంగా వచ్చిన మార్పులు, క్రాస్ బ్రీడింగ్ సమయంలో మ్యూటాజెనిక్ సమస్యలు ఏర్పడినప్పుడు ఇలాంటివి చోటుచేసుకుంటాయి’’ అని నిపుణులు వెల్లడించారు.
ఇటీవల రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లా పురా సిక్రౌడా గ్రామంలో ఓ గేదె అరుదైన రెండు తలల దూడకు జన్మనిచ్చింది. దానికి రెండు తలలు, రెండు నోళ్లు, నాలుగు కళ్లు, నాలుగు చెవులు ఉన్నాయి. ప్రస్తుతం ఆ దూడ ఆరోగ్యంగానే ఉంది. అయితే, గ్రామస్థులు మాత్రం ఆ దూడను ప్రత్యేకంగా చూస్తున్నారు. దానికి పూజలు కూడా చేస్తున్నారు.
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి