సోషల్ మీడియాలో ఫాలోవర్లు, లైక్స్ పెంచుకోవడం నెటిజనులు ఎలాంటి వేషాలు వేస్తున్నారో మీకు తెలిసిందే. కొందరు తమ ప్రతిభతో, ఆకట్టుకొనే ఫొటోలతో ఫాలోవర్లను పెంచుకుంటుంటే.. మరికొందరు మాత్రం తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకోవడం కోసం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ప్రమాదకరమైన స్టంట్లు, నడి రోడ్డుపై డ్యాన్సులు చేస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఓ యువతి తన ఫాలోవర్లను ఆకట్టుకోవడం కోసం ఏకంగా తన తండ్రి శవం వద్దే ఫొటోలు తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజనులు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.  


ఫ్లొరిడాకు చెందిన జేన్ రివెరా అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇటీవల తన తండ్రి భౌతిక కాయాన్ని ఉంచిన శవపేటిక వద్ద ఫొటోలకు పోజులిచ్చింది. అనంతరం ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ‘‘సీతాకోకచిలుక ఎగిరిపోతుంది. రెస్ట్ ఇన్ పీస్ నాన్న. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్’’ అని ఆ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. #dadless అనే హ్యాష్‌ట్యాగ్‌‌తో ఆ ఫొటోలను పోస్ట్ చేసినట్లు ‘డైలీ మెయిల్’ కథనం పేర్కొంది.






ఆమె మొత్తం ఎనిమిది ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ను తప్పకుండా తన ఫాలోవర్లు, బంధువులు ఇష్టపడతారని ఆమె భావించింది. కానీ, అందుకు ప్రతికూలంగా కామెంట్లు ఇచ్చాయి. ఇంత నీచమైన ఫొటోషూట్‌ను ఎప్పుడూ చూడలేదంటూ నెటిజనులు ఆమెను తిట్టడం మొదలుపెట్టారు. దీంతో ఆమె ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించింది. అయితే, అప్పటికీ ఫాలోవర్లు తిడుతూనే ఉన్నారు. ఆ కామెంట్లు ఆమెను బాగా నొప్పించాయి. మీడియా సంస్థలు సైతం ఆమెను విమర్శిస్తూ కథనాలు ప్రసారం చేయడంతో రివెరా తన ఇన్‌స్టా అకౌంట్‌ను డిలీట్ చేసింది. జేన్ రివేరాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 84,000 మంది,  టిక్‌టాక్‌లో 300,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫ్యాషన్, ట్రావెల్, స్విమ్ సూట్స్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఆమె ఆ క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేసినా.. కొందరు మాత్రం ఆ ఫొటోలను స్క్రీన్ షాట్ తీసుకుని మరీ ఆమెను తిట్టిపోస్తున్నారు. 


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి