RSS Event Tamil Nadu: 


 అక్టోబర్ 2న మార్చ్..


అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా తమిళనాడులో RSS మార్చ్‌ నిర్వహించాలని ప్లాన్ చేసుకుంది. ఈ మార్చ్‌కు అనుమతిని నిరాకరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే...ఈ కార్యక్రమానికి మద్రాస్ హైకోర్టు అనుమతినిచ్చింది. కానీ...రాష్ట్ర ప్రభుత్వం మాత్రం శాంతి, భద్రతలు కారణంగా చూపిస్తూ...పర్మిషన్ ఇచ్చేదే లేదని తేల్చి చెప్పింది. అంతే కాదు. RSS మార్చ్‌కి వ్యతిరేకంగా...విదుతలై చిరుతైగల్ కచ్చి (VKC) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని భావించింది. ఈ ఆందోళనలకూ అనుమతి లేదని
స్పష్టం చేసింది ప్రభుత్వం. సెప్టెంబర్ 22న మద్రాస్ హైకోర్ట్ తమిళనాడు ప్రభుత్వానికి కీలక ఆదేశాలిచ్చింది. అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలోని 50 ప్రాంతాల్లో RSS మార్చ్‌కు అనుమతివ్వాలని చెప్పింది. సెప్టెంబర్ 28వ తేదీలోపు ప్రభుత్వం అనుమతినివ్వాలని...సింగిల్ జడ్జ్ బెంచ్ జస్టిస్ GJ ఇలంతరియాన్ చెప్పారు. దీనికి సంబంధించిన ఆర్డర్ త్వరలోనే ఇస్తామని వెల్లడించారు. యూనిఫామ్‌ ధరించి మ్యూజికల్ బ్యాండ్‌తో అక్టోబర్ 2వ తేదీన పలు ప్రాంతాల్లో మార్చ్ నిర్వహించుకునేందుకు అనుమతినివ్వాలని RSS అంతకు ముందు మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసుకోటానికీ పర్మిషన్ ఇవ్వాలని కోరింది. అయితే...హైకోర్టు ఆర్డర్‌నీ పట్టించుకోకుండా తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ మేరకు హోమ్ సెక్రటరీ, DGP, తిరువల్లూర్ ఎస్‌పీ, తిరువల్లూర్ పీఎస్ ఇన్‌స్పెక్టర్‌కి లీగల్ నోటీసులు అందాయి. RSS మార్చ్‌కి అనుమతి నిరాకరించినందుకు ఈ నోటీసులు అందుకున్నారు. 










RSSని నిషేధించండి: కాంగ్రెస్ ఎంపీ


కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ చీఫ్ విప్‌ కొడికున్నిల్ సురేష్ మాత్రం దీనిపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. పీఎఫ్‌ఐ (PFI)తో పాటు RSSని కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. PFI,RSS..రెండూ ఒకటేనని ఘాటైన వ్యాఖ్యలుచేశారు. "PFIని మాత్రమే ఎందుకు బ్యాన్ చేశారు..? RSSని కూడా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాం. PFIని నిషేధించటం మాత్రమే పరిష్కారం కాదు. RSS  కూడా హిందూ కమ్యూనలిజాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. RSS,PFI రెండూ సమానమే. అందుకే...కేంద్రం ఈ రెండింటిపైనా నిషేధం విధించాలి" అని అన్నారు కాంగ్రెస్ నేత సురేష్.