భారత దేశ రక్షా మంత్రికి సైంటిఫిక్ అడ్వైజర్, డీఆర్డీవో మాజీ ఛైర్మన్ సతీష్ రెడ్డి విశాఖలో పర్యటించారు. విశాఖలోని శారదా పీఠానికి సందర్శించిన ఆయన స్వామి స్వరూపానందేంద్రను కలిశారు. ఆయనతో కాసేపు సమావేశం అయిన సతీష్ రెడ్డి శారదపీఠం ఆస్థాన దేవత అయిన రాజ శ్యామల అమ్మవారి దర్శనం చేసుకున్నారు. పీఠంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన వెంట సీనియర్ సైంటిస్ట్ చంద్ర శేఖర్ కూడా ఉన్నారు. సింహాచలం దేవస్థానాన్ని సందర్శించి పూజలు జరిపారు. వారికి ఆలయ ఏఈవో రాజు సాదర స్వగతం పలికి కప్పస్తంభం ఆలింగనం చేయించారు. 


రెండు రోజుల జాతీయ సెమినార్‌లో పాల్గొన్న రక్షా మంత్రి సాంకేతిక సలహాదారు సతీష్ రెడ్డి


విశాఖలో జరుగుతున్న "ఎలక్ట్రోకెమికల్‌ ఎనర్జీ కన్వెర్షన్‌ అండ్ స్టోరేజ్‌-2022 " సెమినార్ లో సతీష్ రెడ్డి పాల్గొన్నారు . ప్రస్తుత డిమాండ్ కు తగ్గట్టుగా ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ సోర్స్  అభివృద్ధి కోసం ఉన్న విభిన్నమైన విధానాల రూపకల్పనపై ఈ సెమినార్ లో సతీష్ రెడ్డి ప్రసంగించారు . విశాఖ లోని నావెల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబరేటరీ లో జరిగిన ఈ సెమినార్ లో పలువురు సైంటిస్ట్ లూ , అధికారులూ పాల్గొన్నారు.