Rajyasabha RRR :     పార్లమెంట్ సమావేశాల్లోనూ  RRR సినిమా హాట్ టాపిక్ అయింది. ఆస్కార్‌ వేదిక చరిత్ర సృష్టించిన మన తెలుగు సినిమా ట్రిపులార్‌ గురించి రాజ్యసభలోనూ ప్రశంసలు వెల్లువెత్తాయి. రాజ్యసభ చైర్మన్‌ జగదీఫ్ ధన్ ఖడ్ ఆర్ఆర్ఆర్  చిత్ర యూనిట్‌ను అభినందించారు. సభలో ఉన్న సభ్యుల చప్పట్లు కొట్టారు.  బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా అవార్డు గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ టీమ్‌కు కూడా రాజ్యసభ చైర్మన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయాలు భారతీయ కళాకారుల అపారమైన ప్రతిభ, అపారమైన సృజనాత్మకత అంకితభావాని తెలియజేస్తాయన్నారు. ఇది అంతర్జాతీయంగా లభించిన గుర్తింపుగా అభివర్ణించారు. 





 అయితే ఈ అంశంపై రాజకీయం కూడా చోటు చేసుకుంది. భారత దేశానికి రెండు ఆస్కార్‌ అవార్డులు దక్కడంపై రాజ్యసభలో కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ మల్లిఖార్జున్‌ ఖర్గే స్పందించారు. ట్రిపులార్‌తో పాటు, ది ఎలిఫెంట్ విస్పర్స్ చిత్రయూనిట్స్‌కి ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ సందర్భంలో ప్రధాని మోదీకి తనదైన శైలిలో చురకలు అంటించారు ఖర్గే. ఆస్కార్‌ విజయాలను మోదీ గారు తమ ఖాతాలో వేసుకోకండి అంటూ చమత్కరించారు.                      





అలాగే కాంగ్రెస్ పార్టీ అదానీ విషయంలో పార్లమంట్‌లో జేపీసీ కోసం పోరాటం చేస్తోంది  దీన్ని ఆన్ లైన్‌లోనూ కొనసాగిస్తోంది. నాటు నాటు పాట‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల ఇమేజ్‌ల స్ధానంలో మోదీ అదానీల ఫొటోల‌ను చేర్చి ఆపై లిరిక్స్ నాటు..నాటు స్ధానంలో లూటో..లూటో  ప‌దాల‌తో మార్చింది. పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తుతం ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న అదానీ-హిండెన్‌బ‌ర్గ్ కేసును ప్ర‌స్తావిస్తూ కాంగ్రెస్ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ పోస్ట్‌ను షేర్ చేసింది.