Republic Day 2023: 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను భారత దేశ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో మహిళా శక్తి నుంచి సైనిక శక్తి వరకు కవాతు నిర్వహించారు. ఈ సంవత్సరం మొదటి సారిగా అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్.. గణతంత్ర దినోత్సన పరేడ్ లో పాల్గొంది. ఈ ఒక్కటే కాకుండా ఈ ఏడు మొదటి సారిగా కనిపించిన మరికొన్నింటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏడు గణతంత్ర వేడుకల్లో కొత్తగా కనిపించినవి..!
- ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్ ను మొదటి సారిగా కర్తవ్య్ మార్గంలో నిర్వహించారు.
- 2023 గణతంత్ర దినోత్సవ వేడకల్లో మొదటి సారిగా స్వావలంబన భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని భారత దేశంలో తయారు చేసిన 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్‌ల ద్వారా 21 గన్ సెల్యూట్ అందించబడింది.
- గణతంత్ర దినోత్సవానికి తొలిసారిగా ఈజిప్టు నాయకుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. మంగళవారం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్సీసీ ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దీంతో పాటు రిపబ్లిక్ డే పరేడ్‌లో ఈజిప్టు సైన్యం తొలిసారిగా తన ఉనికిని చాటుకుంది.
- అగ్నిపథ్ పథకం కింద మొదటిసారిగా అగ్నివీర్ రిపబ్లిక్ డేలో భాగమైంది.
- రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రౌపది ముర్ముకు ఇది మొదటి గణతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంత రాష్ట్ర సంస్కృతిని కాపాడేందుకు ఒడిశా పట్టుచీరను ధరించారు.
- ఈ సంవత్సరం మొదటి సారిగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క ఒంటెల దళంలో మహిళా రైడర్లు పాల్గొన్నారు. ఇందులో సోనాల్, నిషా, భగవతి, అంబిక, కుసుమ్, ప్రియాంక, కౌశల్య, కాజల్, భావన, హీనా సహా 12 మంది మహిళా రైడర్లు ఉన్నారు.
- అలాగే ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మొదటి సారిగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఒక శకటాన్ని ప్రదర్శించింది. ఈ శకటం పేరు డ్రగ్స్ ఫ్రీ ఇండియా.
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన పరేడ్‌లో 35 మంది మహిళా కానిస్టేబుళ్లతో కూడిన ఢిల్లీ పోలీస్ మహిళా పైప్ బ్యాండ్ పాల్గొన్నారు.