రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో 4 పద్మవిభూషన్ అవార్డులు, 17 పద్మభూషన్ అవార్డులు, 107 పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. పద్మవిభూషన్ అవార్డుల్లో కళాకారుడు ప్రభా ఆత్రే, ప్రముఖ సాహిత్యకారుడు రాధేశ్యామ్ కేంహ, జనరల్ బిపిన్ రావత్, కల్యాణ్ సింగ్‌లకు ఇవ్వనున్నారు. ఇందులో ప్రభా ఆత్రే మినహా మిగిలిన వారికి వారి మరణాంతరం ఈ అవార్డు లభిస్తోంది. ఇక పద్మభూషన్‌లో గులాంనబీ ఆజాద్, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటి వారు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ బయోటెక్ యజమానులు సుచిత్రా ఎల్లా, కృష్ణా ఎల్లాలకు పద్మభూషణ్ అవార్డు లభించింది. వారు కోవాగ్జిన్ సృష్టికర్తలు. ఇక పద్మశ్రీ అవార్డులు పలువురికి వచ్చాయి. ఏపీ నుంచి గరికపాటి నర్సింహారావు, గోసవీడు షేక్ హుస్సేన్ , డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావులకు అవార్డులు ప్రకటించారు. గరికపాటి నరసింహారావు అవధానంలో ప్రసిద్ధులు, కళల రంగంలో షేక్ హుస్సేన్‌కు అవార్డు ఇచ్చారు. సుంకర వెంకట ఆదినారాయణరావు వైద్య రంగంలో చేసిన సేవకు గుర్తింపుగా ఇచ్చారు.
Also Read: నిజమైన దేశభక్తులు సైనికులే.. జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి కోవింద్తెలంగాణ నుంచి కళల రంగంలో ఇద్దరికి పద్మశ్రీ లభించింది. కిన్నెర వాయిద్యం కళాకారులు దర్శనం మొగులయ్యకు.. మరో కళాకారుడు రామచంద్రయ్యకు పురస్కారాలు లభించాయి. పద్మజారెడ్డికి కూడా కళల కేటగిరిలో పద్మశ్రీ లభించింది. స్వయంగా తయారు చేసుకున్న వాద్య పరికరంతో పాటలు పడే మొగులయ్యకు ఆలస్యంగానైనా గుర్తింపు లభించిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.ఇటీవల ఆయనే పవన్ కల్యాణ్ సినిమలోని భీమ్లానాయక్ టైటైల్ సాంగ్ పాడారు. ఆర్టీసీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు.
Also Read: కన్నార్పకుండా చూసేలా గణతంత్ర వేడుకలు.. ఈ సారి ఎన్నెన్ని విశేషాలో తెలుసా..?
కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో కమ్యూనిస్టు పార్టీకి చెందిన దివంగత నేత బుద్దదేవ్ భట్టాచార్యకు కూడా పద్మభూషణ్ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన గులాం నబీ ఆజాద్‌కు కూడా పద్మభూషణ్ ప్రకటించారు.