73వ రిపబ్లిక్‌డే సందర్భంగా రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని దూర్‌దర్శన్, ఆల్‌ఇండియా రేడియో ప్రపంచానికి వినిపించాయి. మన ప్రజాస్వామ్యంలోని వైవిధ్యం, చైతన్యం ప్రపంచమే ప్రశంసిస్తోందన్నారు రాష్ట్రపతి.


"ఒకే జాతి అనే స్పిరిట్‌ను ప్రతి ఏడాది రిపబ్లిక్‌డే సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఏడాది కరోనా కారణంగా చాలా నార్మల్‌గా జరుపుకుంటున్నాం. కానీ స్పిరిట్‌ మాత్రం తగ్గలేదు." - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్







"దేశభక్తిని మన సైనికులు ముందుకు తీసుకెళ్తున్నారు. రాత్రి పగలు నిద్రహారాలు లేకుండా దేశాన్ని, దేశ ప్రజలను మన జవాన్లు, పోలీసులు కాపాడుతున్నారు. వాళ్ల కృషి కారణంగానే సరిహద్దుల్లో, దేశంలో శాంతి పరిఢవిల్లుతోంది. దేశ ప్రజలంతా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు." - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్


కరోనా ప్రోటోకాల్‌ పాటించడం మనందరి బాధ్యతని గుర్తు చేశారు రాష్ట్రపతి కోవింద్. 






"మనం ఓ మహమ్మారితో పోరాడుతున్నాం. ఈ టైంలో కరోనా ప్రోటోకాల్ పాటించడం మనందరి విధి. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలి. వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనా రోగులను కాపాడుతున్నారు. "- రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్


"ప్రాథమిక బాధ్యతలు నిర్వహిస్తూ మన స్థాయిలో మనం దేశ సేవ చేయాలి. కోట్ల మంది ప్రజలకు ముందుకొచ్చి స్వచ్ఛభారత్‌ అభియాన్, కొవిడ్‌ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఓ మహోద్యమంలా మార్చారు." - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్


"వైరస్‌ తన రూపాన్ని మార్చుకొని మానవాళిపై తిరుగుబాటు చేస్తోంది. లెక్కలేనన్ని కుటుంబాలు అతలాకుతలమవుతున్నాయి. బాధను వ్యక్తం చేయడానికి మాటలు చాలడం లేదు. ఇప్పుడు ఉన్న వాళ్లను రక్షించుకోవడమే ప్రధాన కర్తవ్యం కావాలి." - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్






మహమ్మారి ఇంకా విస్తృతంగా వ్యాపిస్తోందని, మనం అప్రమత్తంగా ఉండాలని, అజాగ్రత్త వద్దని హితవులు పలికారు రాష్ట్రపతి కోవింద్. ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలను కొనసాగించాలని అన్నారు.


స్వరాజ్యం కోసం  శ్రమించి ప్రజలను ఆ దిశగా నడిపించిన  స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్బంగా స్మరించుకున్నారు రాష్ట్రపతి కోవింద్. 






రిపబ్లిక్‌డే 2022 వేడుకలు చాలా సాధారణంగా జరుగుతున్నాయి. దేశంలో థర్డ్‌ వేవ్‌ చాలా ఉద్ధృతంగా ఉన్న సింపుల్‌గా వేడుకలు జరపడానికి నిర్ణయించింది ప్రభుత్వం. 






ఉదయం పదిన్నరకు రాజ్‌పథ్‌ వద్ద సెలబ్రేషన్స్‌ స్టార్ట్ అవుతాయి. ఈ వేడుకులకు డబుల్ డోస్ వేసుకున్న వాళ్లనే అనుమతిస్తున్నారు. 15ఏళ్ల లోపు పిల్లలను రానివ్వడం లేదు. 


సాధారణంగా కవాతు చూసేందుకు అవకాశం లేని వర్గాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిపబ్లిక్ డే పరేడ్‌తోపాటు 'బీటింగ్ రిట్రీట్' వేడుకను చూడటానికి ఆటో-రిక్షా డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, సఫాయి కర్మచారిలు, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలను ఆహ్వానించారు.